News December 7, 2024
PM కిసాన్: ఏడాదికి రూ.6,000.. కేంద్రం కీలక ప్రకటన

PM కిసాన్ కింద ఏడాదికి ₹6వేల మొత్తాన్ని కౌలు రైతులకూ వర్తింపజేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర మంత్రి రామ్నాథ్ వెల్లడించారు. ట్యాక్స్ పేయర్స్, ఉన్నతాదాయ వర్గాలు, GOVT ఉద్యోగులు ఈ స్కీమ్ కింద లబ్ధి పొంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు రికవరీ చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 18 వాయిదాల్లో ₹3.46L Cr రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. AUG-NOV కాలానికి 9.58 కోట్ల మందికి ₹20,657Cr చెల్లించామన్నారు.
Similar News
News November 23, 2025
వన్డేలకు కొత్త కెప్టెన్ను ప్రకటించిన టీమ్ ఇండియా

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు భారత జట్టుకు కొత్త కెప్టెన్ను BCCI ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్కు రాహుల్ సారథిగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. బుమ్రా, సిరాజ్కు రెస్ట్ ఇవ్వగా గిల్, అయ్యర్ గాయాలతో దూరమయ్యారు.
జట్టు: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, రాహుల్(C), పంత్(VC), సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.
News November 23, 2025
ఒకే వేదికపై కేటీఆర్, కవిత?

అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. ఈ నెల 25న చెన్నైలో ‘ABP నెట్వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్’కు హాజరుకావాలని వీరికి ఆహ్వానం అందింది. ఇప్పటికే KTR వెళ్తానని ప్రకటించగా, కవిత కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టైమింగ్స్ ఖరారు కావాల్సి ఉండగా వీరిద్దరూ ఒకే వేదికపై ఎదురుపడతారా అనేది ఆసక్తికరంగా మారింది. BRSను వీడాక కవిత, KTRను ఏ సందర్భంలోనూ కలుసుకోని సంగతి తెలిసిందే.
News November 23, 2025
భారీ జీతంతో 115 ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి B.Tech, BE, MSc, MCA ఉత్తీర్ణత, వయసు 22-45 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. ఆన్లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు.
వెబ్సైట్: https://bankofindia.bank.in/


