News February 1, 2025
PM కృషి యోజన: కోటీ 70 లక్షల రైతులకు బెనిఫిట్

బడ్జెట్లో రూరల్ ఎకానమీపై భారీగా ఫోకస్ పెట్టారు. 1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను నిర్మల సభకు వినిపించారు. రాష్ట్రాలతో కలిసి దేశవ్యాప్తంగా PM కృషి యోజన కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ ప్రోగ్రామ్ను ఆరంభిస్తున్నట్టు తెలిపారు. తక్కువ ఉత్పత్తి, తక్కువ రుణాలు దొరికే 100 జిల్లాల రైతులకు ఇది లబ్ధి చేకూరుస్తుందన్నారు. పంచాయతీల స్థాయిలో మౌలిక సదుపాయాలు నెలకొల్పుతామన్నారు.
Similar News
News March 14, 2025
రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.
News March 14, 2025
మీరు గొప్పవారు సర్..

TG: సిద్దిపేట జిల్లాకు చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ టీచర్ బాల్ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 1970 నుంచి 2004 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరైనా పాఠాలు చెప్పడం మానట్లేదు. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి, క్యాసారం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లిష్ బోధిస్తున్నారు. రోజూ 15 KM సొంతడబ్బుతో ప్రయాణిస్తూ ఒక్క రూపాయి తీసుకోకుండా విద్యాదానం చేస్తున్నారు.
News March 14, 2025
SRH కెప్టెన్ను మార్చితే..!

IPL-2025లో పాల్గొనే 10 జట్లలో తొమ్మిదింటికి భారత ప్లేయర్లే కెప్టెన్లుగా ఉన్నారు. ఒక్క SRHకు మాత్రమే ఫారిన్ ప్లేయర్ కమిన్స్ సారథ్యం వహిస్తున్నారు. దీంతో SRHకు కూడా స్వదేశీ కెప్టెన్ ఉంటే బాగుంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ జట్టులో తెలుగు ప్లేయర్ అయిన నితీశ్ కుమార్ రెడ్డికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?