News August 11, 2025
జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ ఫోన్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాలను మోదీకి జెలెన్‌స్కీ వివరించారు. ‘శాంతిస్థాపనకు భారత్ కట్టుబడి ఉంది. శాంతియుత పరిష్కారానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఉక్రెయిన్‌కు భారత్ సహకారం కొనసాగుతుంది. భవిష్యత్‌లోనూ సంప్రదింపులు కొనసాగిస్తాం’ అని మోదీ భరోసా ఇచ్చారు. కాగా వచ్చే సెప్టెంబర్‌లో ఇరువురు నేతలూ భేటీ కానున్నారు.
Similar News
News August 11, 2025
నిద్రలో కాళ్లు, చేతులు మొద్దుబారుతున్నాయా?

నిద్రలో కొందరికి చేతులు, కాళ్లు మొద్దుబారిపోతుంటాయి. ఇది ఒక రకమైన ఆరోగ్య సమస్య అని వైద్యులు చెబుతున్నారు. మణికట్టు నరాలపై ఒత్తిడి పెరిగితే వేళ్లు, సయాటిక్ నాడీపై ఒత్తిడి పెరిగితే కాళ్లు, మోచేతి నరాలపై ఒత్తిడి పెరిగితే చేతులు తిమ్మిరి ఎక్కుతాయి. విటమిన్ B12, B6, మెగ్నీషియం లోపం వల్ల నరాలు బలహీనపడి ఒత్తిడికి గురవుతాయి. మెరుగైన రక్త ప్రసరణకు వ్యాయామం చేయాలని, సమతుల ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
News August 11, 2025
APలో మైండ్‌ట్రీ పెట్టుబడులు

AP:అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రముఖ టెక్ సంస్థ LTIMindtree పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ‘దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు గర్వంగా ఉంది. L&T, IBM, AP GOVTతో కలిసి ప్రపంచస్థాయి క్వాంటమ్ ఎకో సిస్టమ్‌ను ఆవిష్కరిస్తాం. మా క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డీప్ టెక్ రీసెర్చ్, ఇంక్యుబేషన్, ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తుంది’ అని Xలో వెల్లడించింది.
News August 11, 2025
ఆక్వా రంగం నష్టపోకుండా చర్యలు: అచ్చెన్నాయుడు

AP: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం భారత్‌తో పాటు అన్ని దేశాలపై పడిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రంగానికి <<17357620>>నష్టం <<>>లేకుండా అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు. ఎల్లుండి ఆక్వా రంగంపై సమావేశం నిర్వహిస్తామని, అభివృద్ధికి నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. సమస్యను అధిగమించేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.