News April 18, 2024
ఏపీకి రానున్న ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో రాష్ట్రానికి రానున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్న అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట లేదా కడపతో పాటు మరో నియోజకవర్గంలోనూ ఆయన పాల్గొంటారు. ప్రధానితోపాటు టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా సభల్లో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా మోదీ పర్యటన తేదీలు ఇంకా షెడ్యూల్ చేయాల్సి ఉంది.
Similar News
News December 3, 2025
‘సంచార్ సాథీ’పై వెనక్కి తగ్గిన కేంద్రం

సంచార్ సాథీ యాప్పై కేంద్రం వెనక్కి తగ్గింది. మొబైళ్లలో ప్రీ <<18439451>>ఇన్స్టాలేషన్<<>> తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. సాథీ యాప్ను అన్ని కొత్త మొబైళ్లలో ప్రీ ఇన్స్టాలేషన్ చేస్తామన్న కేంద్రం ప్రకటనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశ పౌరులపై నిఘా పెట్టేందుకే ఈ యాప్ తెస్తోందని, ఇది ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో యాప్ ప్రీ ఇన్స్టాలేషన్ తప్పనిసరి కాదని కేంద్రం పేర్కొంది.
News December 3, 2025
ప్రజలను కేంద్రం దగా చేస్తోంది: రాహుల్ గాంధీ

కుల గణనపై కేంద్రం తీరును రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ‘పార్లమెంటులో కుల గణనపై నేనో ప్రశ్న అడిగా. దానికి కేంద్రం ఇచ్చిన సమాధానం విని షాకయ్యాను. సరైన ఫ్రేమ్ వర్క్ లేదు, టైమ్ బౌండ్ ప్లాన్ లేదు, పార్లమెంట్లో చర్చించలేదు, ప్రజలను సంప్రదించలేదు. కులగణనను విజయవంతంగా చేసిన రాష్ట్రాల నుంచి నేర్చుకోవాలని లేదు. క్యాస్ట్ సెన్సస్పై మోదీ ప్రభుత్వ తీరు దేశంలోని బహుజనులను దగా చేసేలా ఉంది’ అని ట్వీట్ చేశారు.
News December 3, 2025
NIEPMDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిఫుల్ డిజబిలిటీస్ (NIEPMD) 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG, B.Ed, M.Ed (Spl.edu), PhD, M.Phil, PG( సైకాలజీ, ఆక్యుపేషనల్ థెరపీ), డిగ్రీ (ప్రోస్థెటిక్స్&ఆర్థోటిక్స్), B.Com, M.Com, MBA, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://niepmd.nic.in


