News January 21, 2025

ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు

image

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శుభాకాంక్షలు. అధ్యక్షుడిగా పదవీకాలం విజయవంతంగా పూర్తి కావాలి. ఇరు దేశాల ప్రయోజనం కోసం కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.

Similar News

News December 3, 2025

APPSC పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

image

APPSC ఈ క్యాలెండర్ ఇయర్‌లో విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను <>ప్రకటించింది<<>>. రాతపరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) పరీక్ష జనవరి 27, 31, ఫిబ్రవరి 9, 11, 12 తేదీల్లో, సంబంధిత సబ్జెక్టు పేపర్ల పరీక్షలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించనున్నారు. విశాఖ, తూ.గో., NTR, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్షలు జరగనున్నాయి.

News December 3, 2025

టెన్త్ అర్హతతో 362 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 362 మల్టీ టాస్కింగ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్( టైర్ 1, టైర్ 2) ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: mha.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News December 3, 2025

HALలో అప్రెంటిస్ పోస్టులు

image

HAL గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్(EX-ITI) అప్రెంటిస్‌లను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, డిప్లొమా ఉత్తీర్ణులు www.mhrdnats.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిప్లొమా విద్యార్థులను ఈనెల 8 -13వరకు, ఇంజినీరింగ్ అభ్యర్థులను ఈనెల 17-20 తేదీల్లో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. EX ITI అభ్యర్థులు NAPS అప్రెంటిస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, దరఖాస్తును ఈ నెల 15లోగా పంపాలి. hal-india.co.in