News July 11, 2024

అంబానీ పెళ్లి వేడుకకు ప్రధాని మోదీ?

image

బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్- రాధిక వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు సమాచారం. రేపు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహం జరగనుంది. పశ్చిమ బెంగాల్ CM మమత ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి, ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరుకానున్నారు.

Similar News

News March 23, 2026

నేడూ అసెంబ్లీలో హై హీట్ చర్చ

image

నేడు 10 గం.కు అసెంబ్లీ ప్రారంభం కానుంది. ప్రభుత్వం తరుఫున మంత్రులు 2 బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలోను బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు బడ్జెట్‌పై తీవ్రంగా గగ్గోలు పెడుతున్నాయి, ప్రజలకు న్యాయం చేయకుండా కార్పొరేట్ పాలసీకి న్యాయం చేస్తూ అధికార నేతలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

News March 23, 2026

భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కారణాలివే!

image

తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ స్కిన్ లెస్ రేటు రూ.370-400కు చేరింది. వాతావరణంలో అనూహ్య మార్పుల (ఎండలు+వర్షాలు) వల్ల పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కోడి సగటున 3 కేజీల వరకు పెరిగేదని, ప్రస్తుతం కిలోన్నర మాత్రమే ఉంటోందని పేర్కొంటున్నారు. ఉత్పత్తి పడిపోవడం, వరుస పెళ్లిళ్లు, గ్రామాల్లో ఉత్సవాల కారణంగా డిమాండ్ పెరగడం వల్ల రేటు అధికమైందంటున్నారు.

News March 23, 2026

ఈ నెల 28 వరకు వర్షాలు!

image

AP: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ వరకు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఇవాళ SKLM, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA చెప్పింది. మిగతా జిల్లాల్లోనూ జల్లులు పడతాయని అంచనా వేసింది.