News May 5, 2024
రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ

AP: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాష్ట్రానికి రానున్నారు. రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అలాగే ఈ నెల 7న రాజంపేట నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభ, విజయవాడలో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు పోలీసులు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలను భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
Similar News
News December 28, 2025
ఇల్లు ఏ ఆకారంలో ఉండటం ఉత్తమం?

ఇల్లు చతురస్రం లేదా దీర్ఘ చతురస్ర ఆకారాల్లో ఉండటం ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఈ ఆకారాలు ఇంట్లో శక్తిని సమతుల్యం చేస్తాయి. క్రమపద్ధతి లేకుండా మూలలు పెరగడం, తగ్గడం వంటి ఎగుడుదిగుడులు ఉండనివ్వవు. వంకరలు, అస్తవ్యస్తమైన ఆకృతులు ఉన్న ఇల్లు వాస్తు దోషాలకు దారితీసి అశాంతిని కలిగిస్తుంది. సరైన కొలతలతో కూడిన క్రమబద్ధమైన ఆకృతే యజమానికి శ్రేయస్సు చేకూరుస్తుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 28, 2025
త్వరలో కరెంట్ బిల్లులు తగ్గే ఛాన్స్!

విద్యుత్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్లు వసూలు చేసే ఛార్జీలపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సమీక్షిస్తోంది. 2026లో అమలులోకి వస్తున్న మార్కెట్ కప్లింగ్ విధానంతో అన్ని ఎక్స్ఛేంజీలు ఒకే రేట్ వసూలు చేయాలి. ప్రస్తుతం యూనిట్కు 2పైసలుగా ఉన్న ట్రాన్సాక్షన్ ఫీజును 1.5/1.25పైసలకు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో డిస్కంలు తక్కువ ధరకు కరెంట్ కొనుగోలు చేస్తే సామాన్యులకు కరెంట్ బిల్ తగ్గుతుంది.
News December 28, 2025
గాదె ఇన్నయ్య ‘మా ఇల్లు’కు మంత్రి సీతక్క

TG: జనగామ జిల్లా జాఫర్గఢ్లోని <<18631208>>గాదె ఇన్నయ్య <<>>నిర్వహిస్తున్న ‘మా ఇల్లు’ అనాథాశ్రమాన్ని మంత్రి సీతక్క ఇవాళ సందర్శించారు. ఇన్నయ్యను మిస్ అవుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్న పిల్లలను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. చదువుకు, బసకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సాగరం గ్రామంలోని ఇన్నయ్య ఇంటికి వెళ్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు.


