News May 20, 2024
ఇబ్రహీం రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

ఇరాన్ అధ్యక్షుడు డా.సయ్యద్ ఇబ్రహీం రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇబ్రహీం కుటుంబసభ్యులు, ఆ దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్కు అండగా ఉంటుంది’ అని మోదీ ట్వీట్ చేశారు.
Similar News
News October 20, 2025
జుట్టు పెరగాలంటే హెయిర్ కట్ తప్పనిసరా?

జుట్టును కొద్దిగా కత్తిరించుకుంటే వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ జుట్టు పెరగడానికి హెయిర్కట్కి సంబంధం లేదంటున్నారు నిపుణులు. కానీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చివర్లు కత్తిరించడం మంచిదని సూచిస్తున్నారు. స్ప్లిట్ ఎండ్స్ వల్ల జుట్టు నిర్జీవంగా, గడ్డిలా తయారవుతుంది. కాబట్టి 3-4 నెలలకోసారి చివర్లు కత్తిరిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. <<-se>>#Haircare<<>>
News October 20, 2025
అరటిలో మాంగనీసు ధాతు లోపం – నివారణ

అరటి తోటలో మాంగనీసు ధాతులోపం వల్ల ముదురు ఆకులపై నిర్ణీత ఆకారం లేని పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగు మచ్చ మధ్యలో ఎండిపోతుంది. మాంగనీసు ధాతులోపం తీవ్రమైతే ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. పిలకల లేత ఆకులు, ఆకుమచ్చ చారలతో తెల్లగా మారి లోపం తీవ్రమైనప్పుడు ఎండిపోతాయి. లోప నివారణకు లీటరు నీటికి మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు కలిపి ఆకులన్నీ తడిచేలా 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.
News October 20, 2025
బిహార్ తొలి విడత ఎన్నికలకు ముందు పీఎం కిసాన్ నిధులు విడుదల?

దీపావళి సందర్భంగా కేంద్రం PM కిసాన్ 21వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని వార్తలు వచ్చినా మోదీ సర్కార్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే నవంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా రైతులకు రూ.2వేల చొప్పున జమ చేసే అవకాశం ఉందని నేషనల్ మీడియా పేర్కొంది. బిహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు (నవంబర్ 6) ముందు కేంద్రం దీనిపై ప్రకటన చేయవచ్చని తెలిపింది. ఈ-కేవైసీ పూర్తి కాని రైతులకు డబ్బులు జమ కావని వివరించింది.