News April 20, 2024
షమీపై ప్రధాని మోదీ ప్రశంసలు

టీమ్‌ఇండియా బౌలర్ మహమ్మద్ షమీపై ప్రధాని మోదీ ప్రశంసలు కురింపించారు. ‘ప్రపంచకప్‌లో షమీ భాయ్ ఎంత బాగానే రాణించారో ప్రపంచమంతా చూసింది. క్రీడల్లో ఆయన చేసిన అద్భుత కృషికి మెచ్చి కేంద్రం అర్జున అవార్డు ఇచ్చి ప్రోత్సహించింది. ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో రెండడుగులు ముందుకు వేశారు. యువత కోసం స్టేడియం కట్టిస్తున్నారు’ అని యూపీలో షమీ సొంతూరైన అమ్రోహాలో పర్యటించిన సందర్భంగా పేర్కొన్నారు.
Similar News
News January 23, 2026
టాస్ గెలిచిన భారత్

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. జట్టులో 2 మార్పులు జరిగాయి. అక్షర్, బుమ్రాకి రెస్ట్ ఇచ్చి వారి స్థానంలో కుల్దీప్, హర్షిత్ రాణాను తీసుకున్నారు.
IND: శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ సింగ్, హర్షిత్, అర్ష్‌దీప్, కుల్దీప్, వరుణ్.
NZ: కాన్వే, సీఫర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, సాంట్నర్, ఫౌల్క్స్, హెన్రీ, సోథీ, జాకబ్.
News January 23, 2026
తులసిమతి మురుగేషన్‌కు మూడు బంగారు పతకాలు

కైరోలో జరిగిన ఈజిప్ట్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్‌కు చెందిన ప్లేయర్ తులసిమతి మూడు బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకున్నారు. తమిళనాడుకు చెందిన తులసి ఏప్రిల్ 11, 2002లో జన్మించారు. తులసి ఎడమచేతికి పూర్తి వైకల్యం ఉన్నా దాన్ని అధిగమించి ఏడేళ్ల వయసులో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించారు. ఇప్పటి వరకు అనేక పతకాలు గెలుచుకున్న ఆమె ఖాతాలో పారిస్ పారాలింపిక్స్ రజత పతకం కూడా ఉంది.
News January 23, 2026
కాలికి నల్ల దారం కట్టుకుంటున్నారా?

దిష్టి తగలకూడదని కాళ్లకు నల్ల దారం కట్టుకుంటారు. అయితే మంగళవారం లేదా శనివారం రోజున దాన్ని ధరించడం శుభకరమంటున్నారు పండితులు. పురుషులు కుడి కాలికి, స్త్రీలు ఎడమ కాలికి దీనిని కట్టుకోవాలని సూచిస్తున్నారు. ‘దారానికి తొమ్మిది ముడులు వేయడం ముఖ్యం. నలుపు రంగు ఉన్న చోట వేరే ఇతర రంగు దారాలు ఉండకూడదు. ఈ పద్ధతులు పాటించడం వల్ల ఆశించిన ఫలితం లభిస్తుంది’ అని చెబుతున్నారు.


