News January 31, 2025
అమెరికా ప్రమాద ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో హెలికాప్టర్, విమానం ఢీకొన్న ఘోర దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియచేశారు. ఈ కష్టకాలంలో భారత్ అమెరికా ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా <<15316044>>ఆర్మీ హెలికాప్టర్, విమానం ఢీకొన్న ఘటనలో<<>> 67మంది కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 18, 2025
జనవరిలోనే WPL షురూ.. డేట్స్ ఇవేనా?

వచ్చే ఏడాది జనవరి 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3న ఫైనల్ జరిగే అవకాశం ఉందని Cricbuzz తెలిపింది. WPL-2026 కోసం నవీ ముంబై, వడోదర స్టేడియాలను ఎంపిక చేయొచ్చని తెలిపింది. ఫిబ్రవరిలో జరిగే T20 పురుషుల ప్రపంచకప్ను భారత్ కో-హోస్ట్ చేస్తుండటంతో WPLను ముందుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 26న వేదికలు, తేదీలు ఖరారు కానున్నాయి. 27న మెగా వేలం జరగనుంది.

రికార్డు స్థాయిలో పసిడి దిగుమతులు

ధరలు పెరుగుతున్నా పసిడికి గిరాకీ తగ్గడంలేదు. రికార్డు స్థాయిలో దిగుమతులు జరుగుతున్నాయి. అక్టోబర్లో 14.72 బిలియన్ డాలర్ల బంగారం ఇంపోర్ట్ అయింది. గతేడాది అక్టోబర్తో పోలిస్తే దాదాపు 3 రెట్లు($4.92Bn) అధికం కావడం గమనార్హం. ఏప్రిల్-అక్టోబర్ మధ్య $41.23Bn దిగుమతులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 21.44%($34Bn) ఎక్కువ. స్విట్జర్లాండ్ నుంచి 40%, UAE నుంచి 16%, సౌతాఫ్రికా నుంచి 10% గోల్డ్ వస్తోంది.