News April 25, 2024
PM మోదీకి గుణపాఠం చెప్పాలి: CM రేవంత్

TG: పార్లమెంటు ఎన్నికల్లో PM మోదీకి గుణపాఠం చెప్పాలని రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ పిలుపునిచ్చారు. ‘ఏటా ఉద్యోగాల పేరుతో యువతను, ఖాతాల్లో ₹15లక్షలు వేస్తామని ప్రజల్ని మోదీ మోసం చేశారు. నల్లచట్టాలు తెచ్చి కార్పొరేటర్లకు దోచిపెట్టారు. రైతులు పోరాటం చేయడంతో వెనక్కి తగ్గారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో దగా చేస్తున్నారు. సిలిండర్ ధరను ₹1200కు పెంచారు’ అని విమర్శించారు.
Similar News
News January 1, 2026
రూ.20కే గోధుమపిండి.. పంపిణీ ప్రారంభం

AP: రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు గోధుమపిండి పంపిణీ ప్రారంభమైంది. నేటి నుంచి బియ్యం, పంచదారతో పాటు గోధుమపిండి, జొన్నలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. కిలో పిండి రూ.20కే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 6 జిల్లాల్లో అమలు చేస్తున్నామని, వచ్చే నెల మరో 2 జిల్లాల్లో అమలు చేస్తామన్నారు. ఈ చక్కీ గోధుమపిండి పిల్లలు, వృద్ధులకు న్యూట్రిషన్ ఫుడ్గా ఉపయోగపడుతుందని, ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు.
News January 1, 2026
జల వివాదాలపై చర్చకు సర్కార్ సిద్ధం!

TG: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కృష్ణా జలాల వివాదంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో BRSను ఎదుర్కోవడంపై సీఎం రేవంత్ సహా మంత్రులు సన్నద్ధమవుతున్నారు. కాసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో జరిగే చర్చలో ఎలా వ్యవహరించాలనేదానిపై నేతలకు సీఎం కూడా దిశానిర్దేశం చేశారు.
News January 1, 2026
అలాంటి సీఎంతో మేం చర్చలు చేయాలా: KTR

TG: నదీ జలాలు, సాగునీటి అంశాలపై కనీస అవగాహన లేని CM అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారంటూ రేవంత్ను KTR విమర్శించారు. రేపు అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై చర్చ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భాక్రా నంగల్ ప్రాజెక్ట్ TGలో ఉందని CM అన్నారు. అది హిమాచల్ ప్రదేశ్లో ఉందన్న విషయం కూడా ఆయనకు తెలియదు. అలాంటి CMతో చర్చ చేయాలా’ అని ప్రశ్నించారు. BRSకు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చే ఛాన్సివ్వాలన్నారు.


