News January 11, 2025
ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూర్‌కు ప్రధాని మోదీ

వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటించనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వెల్లడించారు. ఆ నెల 11, 12 తేదీల్లో జరిగే ఏఐ సదస్సులో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. కాగా గత ఏడాదిన్నరలో మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2023 జులైలో ఆయన అక్కడ పర్యటించారు. ఆ తర్వాత 2024 రిపబ్లిక్ వేడుకలకు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ విశిష్ఠ అతిథిగా భారత్‌కు వచ్చారు.
Similar News
News January 8, 2026
తిరుపతి: పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (AITT) క్రాప్స్ మెన్ ట్రైనింగ్ స్కీం(CTS)-2026 పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గణేశ్ పేర్కొన్నారు. 21 సంవత్సరాలు వయసు కలిగి ఉండి, 3 సంవత్సరాలు పని అనుభవం, అప్రెంటిస్ పూర్తి చేసి, SCVT పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 28వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 8, 2026
ప్రీమియర్స్ కోసం వెయిటింగ్ ‘రాజాసాబ్’!

TG: ‘రాజాసాబ్’ ప్రీమియర్స్ విషయంలో సస్పెన్స్ వీడటం లేదు. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ప్రీమియర్స్ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. అప్డేట్ ఇవ్వాలంటూ మేకర్స్‌ను అడుగుతున్నారు. కాగా మరికాసేపట్లో రాజాసాబ్ ప్రీమియర్లపై జీవో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
News January 8, 2026
ఈడీ రెయిడ్స్.. ఇంతకీ ప్రతీక్ జైన్ ఎవరు?

ఐప్యాక్ ఆఫీసు, ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిపై <<18796717>>ED దాడులు<<>> చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీక్ జైన్ ఎవరనే చర్చ జరుగుతోంది. IIT బాంబే పూర్వ విద్యార్థి అయిన ప్రతీక్ ఎన్నికల వ్యూహం, డేటా విశ్లేషణలో ఎక్స్పర్ట్. I-PAC కోఫౌండర్. 2019 నుంచి TMCతో కలిసి పని చేస్తున్నారు. ఆ పార్టీ IT సెల్ హెడ్‌గానూ ప్రతీక్ కొనసాగుతున్నారు. TMCతోపాటు పలు పార్టీలు, ప్రభుత్వాలకు సలహాదారుగా I-PAC వ్యవహరిస్తోంది.


