News December 26, 2024
కొత్త ఏడాదిలో చైనా, అమెరికాకు ప్రధాని మోదీ?

కొత్త సంవత్సరంలో PM మోదీ పర్యటనల క్యాలెండర్ను విదేశీ వ్యవహారాల శాఖ సిద్ధం చేస్తోంది. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. ట్రంప్ అధ్యక్షుడిగా అధికారం స్వీకరించిన అనంతరం ఆయనతో భేటీ అయ్యేందుకు మోదీ US వెళ్లే అవకాశం ఉంది. ఇక బ్రెజిల్లో బ్రిక్స్, చైనాలో SCO సదస్సుకు ప్రధాని హాజరుకానున్నారు. ఈక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఆయన ప్రత్యేకంగా ద్వైపాక్షిక భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Similar News
News November 21, 2025
సెలవులో గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సెలవు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి సొంత రాష్ట్రమైన పంజాబ్ వెళ్లారు. ఈ నెల 26న తిరిగి గుంటూరు వచ్చి మరుసటి రోజు అంటే 27న ఎస్పీ వకుల్ జిందాల్ విధుల్లోకి చేరనున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావును పోలీస్ శాఖ ఉన్నతాధికారులు గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా నియమించారు.
News November 21, 2025
యాషెస్ సిరీస్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

యాషెస్ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
☛ AUS XI: ఖవాజా, వెదరాల్డ్, లబుషేన్, స్మిత్(C), హెడ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, లియాన్, బ్రెండన్ డాగెట్, బోలాండ్
☛ ENG XI: డకెట్, క్రాలే, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్(C), J స్మిత్, అట్కిన్సన్, కార్స్, ఆర్చర్, వుడ్
☛ LIVE: స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్
News November 21, 2025
iBOMMA రవి కేసును ఫ్రీగా వాదిస్తానన్న లాయర్.. తండ్రి ఏమన్నారంటే?

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును ఉచితంగా వాదించి అతన్ని బయటకు తీసుకొస్తానంటూ సలీమ్ అనే న్యాయవాది ముందుకొచ్చారు. విశాఖ జిల్లా పెదగదిలి సాలిపేటలో ఉంటున్న రవి తండ్రి అప్పారావును ఆయన కలిశారు. కేసును వాదించేందుకు కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని కోరగా తాను నిరాకరించినట్లు అప్పారావు తెలిపారు. తన ఆరోగ్యం సహకరించనందున కోర్టుల చుట్టూ తిరగలేనని చెప్పానన్నారు.


