News April 25, 2024
తెలంగాణలో పీఎం మోదీ షెడ్యూల్ ఖరారు

TG: రాష్ట్రంలో పీఎం మోదీ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 30న ఆందోల్‌లో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఆరోజు సాయంత్రం ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు. ఇక వచ్చే నెల 3,4 తేదీల్లోనూ రాష్ట్రంలో పర్యటిస్తారు. 3న వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్గొండ స్థానాలకు కలుపుతూ మరో సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తర్వాతి రోజు నారాయణపేట, వికారాబాద్‌లో జరిగే సభల్లో ప్రధాని పాల్గొంటారని పీఎంవో వర్గాలు తెలిపాయి.
Similar News
News March 5, 2026
ప్రపంచంలో రద్దీగా ఉండే జలసంధులు ఇవే..

వివిధ ఖండాల మధ్య ఉన్న జలసంధుల ద్వారా చమురు రవాణా సాగుతుంటుంది. ఇందులో మలక్కా జలసంధి అతి ముఖ్యమైనది. ఇండోనేషియా దీవుల్లో ఉండే ఈ సంధి ద్వారా రోజుకు 23.2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ సరఫరా అవుతుంది. ఆ తర్వాత ఇరాన్ దగ్గరలోని హార్ముజ్ (20.9 M), సౌతాఫ్రికా కింద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ (9.1 M), ఈజిప్ట్ సూయిజ్ కెనాల్ (4.9 M), డానిష్ సంధి (4.9 M) ఉన్నాయి. తాజా యుద్ధంతో హార్ముజ్‌ను మూసివేశారు.
News March 5, 2026
హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

HYDలోని<
News March 5, 2026
రాజ్యసభ అభ్యర్థి నితీశ్ కుమార్ నామినేషన్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం షా సమక్షంలో నితీశ్ నామినేషన్ ఫైల్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే మార్చి 16 వరకు ఆయన సీఎం పదవిలో ఉంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.


