News March 18, 2024
ప్రధాని మోదీ ఏపీ పర్యటన వివాదాస్పదం.. ఈసీకి ఫిర్యాదు

నిన్న ప్రధాని మోదీ ఏపీ పర్యటన వివాదాస్పదంగా మారింది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధాని ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌ను ఉపయోగించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ TMC ఎంపీ సాకేత్ గోఖలే ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ కారణంతోనే 1975లో ఇందిరాగాంధీపై అనర్హత వేటు పడిందని చెప్పారు. ఒక వేళ బీజేపీ IAF చాపర్‌కు రెంట్ చెల్లించి ఉంటే.. దానికి గల కారణాలను కూడా ఈసీ వెల్లడించాలని కోరారు.
Similar News
News March 3, 2026
UAEలో ‘ప్యానిక్ బయ్యింగ్’.. ప్రభుత్వం భరోసా!

ఇరాన్ దాడుల నేపథ్యంలో UAEలో నీటి కొరత ఏర్పడొచ్చనే భయాందోళనలు మొదలయ్యాయి. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో జనం సూపర్ మార్కెట్లకు పోటెత్తడంతో నిత్యావసరాలు, బాటిల్ వాటర్ షెల్ఫ్స్ ఖాళీ అవుతున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరా నిలిచిపోతుందనే అనుమానాలే ఈ ‘ప్యానిక్ బయ్యింగ్’కు దారితీశాయి. అయితే దేశంలో 3నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని UAE ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
News March 3, 2026
పనికిమాలిన మాటలు ప్రతి నటుడూ చెబుతాడు: సత్యరాజ్

విషయం లేనివారే సినిమా డైలాగులు చెబుతారని TVK చీఫ్ విజయ్‌ని ఉద్దేశించి నటుడు సత్యరాజ్ కామెంట్స్ చేశారు. ‘పంచ్ డైలాగులు జనం చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. సినిమా వేరు, రాజకీయాలు వేరు. పనికిమాలిన మాటలు ప్రతి నటుడూ చెబుతాడు’ అని విమర్శించారు. ఇక TNను మరో అయోధ్యగా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో సనాతన Vs ద్రావిడ సిద్ధాంతం మధ్యే పోటీ అని, స్టాలిన్ ఉన్నంతవరకు మతశక్తులకు చోటు ఉండదన్నారు.
News March 3, 2026
మత్తు చాక్లెట్లు ఇచ్చి లైంగిక దాడి

TG: ఓ యువతికి యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన బాచుపల్లి(Hyd)లోని బీటెక్ కాలేజీలో జరిగింది. పోలీసుల ప్రకారం.. తనయ్ అనే స్టూడెంట్ అదే కాలేజీలో చదివే యువతికి మాయమాటలు చెప్పి మత్తు చాక్లెట్లు ఇచ్చి క్లాసులోనే పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఆ ఫొటోలు నెట్‌లో పెడతానని బెదిరించాడు. అతని స్నేహితుడూ వేధించాడు. దీంతో ఆత్మహత్యాయత్నం చేయగా ఇంట్లోవాళ్లకు తెలిసి పోలీసులను ఆశ్రయించారు.


