News February 7, 2025
ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు పీఎంవో తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్రాన్స్‌లో ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఏఐ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే అక్కడ ఉన్న థర్మో న్యూక్లియర్ రియాక్టర్‌ను సందర్శించనున్నారు. అనంతరం 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధాని పర్యటించనున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన US వెళ్లనున్నారు.
Similar News
News November 23, 2025
భీమవరం: ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు

భీమవరంలో సత్యసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని, బాబా చిత్రపటానికి నివాళులర్పించారు. మానవసేవే మాధవసేవగా బాబా అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలను అందరూ పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
News November 23, 2025
ఇంధన పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు

AP: ఇంధన సామర్థ్యం/పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు జెన్కో MD నాగలక్ష్మి వెల్లడించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు పోటీకి అర్హులని తెలిపారు. ‘తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో 30-120సెకన్ల నిడివితో MP4 ఫార్మాట్లో వీడియోలు రూపొందించి DEC 10లోగా పంపాలి. తొలి 3 స్థానాల్లో నిలిచిన వారికి ₹20K, ₹10K, ₹5K బహుమతులు ఇస్తాం. వివరాలకు 0866-2457620 నంబరులో సంప్రదించాలి’ అని చెప్పారు.
News November 23, 2025
సర్పంచి ఎన్నికలు.. UPDATE

TG: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ రిజర్వేషన్ల జాబితాను జిల్లాల కలెక్టర్లకు పంపిస్తోంది. సాయంత్రం కల్లా ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. జనాభా నిష్పత్తిని బట్టి SC, ఎస్టీ, బీసీ స్థానాలను కేటాయించినట్లు సమాచారం. కాగా బీసీలకు 22%తో కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.


