News July 23, 2024

యువత కోసం 5 పథకాలతో ‘పీఎం ప్యాకేజీ’

image

ఈ బడ్జెట్లో యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు పథకాలను కలిపి పీఎం ప్యాకేజీని ప్రకటించారు. దీనికి రూ.2 లక్షల కోట్లను కేటాయించారు. విద్య, ఉపాధి కల్పన, నైపుణ్య వృద్ధిపై దృష్టి సారిస్తారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.48 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. ఉపాధి రంగం ఏదైనా తొలి నెల వేతనం కింద రూ.15,000 నగదు బదిలీ ఇందులోకే వస్తుంది.

Similar News

News December 18, 2025

ఆహారాన్ని పాలుగా మార్చే శక్తి ఎక్కువ

image

ముర్రా జాతి గేదెలకు ఉండే మరో ప్రత్యేకత అధిక పాల సామర్థ్యం. ఇవి ఎంత ఎక్కువ మేత తింటే ఆ ఆహారాన్ని అంత ఎక్కువగా పాలుగా మార్చుకుంటాయి. ఈ సామర్థ్యం మిగతా జాతి గేదెల కంటే ముర్రాజాతి గేదెలకే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇతర జాతి గేదెల్లా కాకుండా తక్కువ మేత ఖర్చుతో ఎక్కువ పాల ఉత్పత్తిని పొందవచ్చు. వీటిలో మగ గేదెలు 550-750 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఆడ గేదెలు 450-500 కేజీల వరకు బరువు పెరుగుతాయి.

News December 18, 2025

బాత్ సాల్ట్ గురించి తెలుసా?

image

బాత్ సాల్ట్ అనేది ఖనిజాలు కలిసిన ఉప్పు. దీన్ని కేవలం స్నానానికి మాత్రమే ఉపయోగిస్తారు. హిమాలయన్ బాత్ సాల్ట్, డెడ్ సీ బాత్ సాల్ట్… ఇలా చాలా రకాల స్నానపు ఉప్పులు ఉన్నాయి. ముఖంపై మొటిమలు, యాక్నే ఉంటే నీళ్లల్లో బాత్ సాల్ట్ వేసుకొని స్నానం చేస్తే జిడ్డు తగ్గుతుంది. దీంతో పాటు నొప్పులు, అలసట నుంచి ఉపశమనం పొందొచ్చు. ఒత్తిడీ అదుపులో ఉంటుంది. స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్‌‌కూ బాత్ సాల్ట్ సాయపడుతుంది.

News December 18, 2025

ముర్రా జాతి గేదెలతో ఎందుకు మేలంటే?

image

ముర్రా జాతి పశువు జీవితకాలం 20 ఏళ్లుగా ఉంటుంది. 10 ఈతలు ఈనడానికి అవకాశం ఉంటుంది. రెండున్నరేళ్ల నుంచి మూడేళ్ల వయసు మధ్యలో ముర్రా గేదెలు ఎదకు వస్తాయి. ఏటా ఈ గేదెలకు దూడ పుట్టడం పాడి రైతుకు లాభదాయకం. ముర్రా గేదెలు ఈనిన తర్వాత 3 నెలలకే మళ్లీ ఎదకు రావడం వాటిలో గొప్ప లక్షణం. తర్వాత పది నెలలకు ఈనుతుంది. ఇలా ప్రతి ఏడాదీ దూడ పుట్టడానికి, పాల దిగుబడి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.