News April 9, 2025

PMAGYతో గ్రామాల అభివృద్ధి: కలెక్టర్

image

ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామీణ యోజన క్రింద ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు 19 గ్రామాలు ఎంపికయ్యాయి. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గ్రామ సర్పంచులు, ఎంపీడీవోలకు మంగళవారం సూచించారు. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామీణ యోజన పథకంపై గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.

Similar News

News January 11, 2026

గండికోటలో ఉన్న ముఖ్యమైన కట్టడాలు ఇవే.!

image

➤ జమా మసీదు: 64 గదులు, బయట 32 గదులతో కూడిన గొప్ప నిర్మాణం.
➤ మాధవరాయ ఆలయం: 4 అంతస్తుల గోపురంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
➤ రఘునాథస్వామి ఆలయం: సంక్లిష్టమైన స్తంభాలు, గాలి తగిలే కారిడార్‌లతో కూడిన ముఖ్యమైన చారిత్రక కట్టడం.
➤ మిని చార్మినార్: గోల్కొండ సుల్తానుల కాలం నాటి 3 అంతస్తుల టవర్
➤ ఎర్ర కోనేరు: రాజులు తమ కత్తులను కడిగించుకోవడానికి ఉపయోగించేవారని పురాణం
➤ జైలు, ధాన్యాగారం, పెన్నా నది లోయ.

News January 11, 2026

పెద్దాపురప్పాడులో వ్యక్తి మృతి.. సిగరెట్ నిప్పు ప్రాణం తీసిందా?

image

పెద్దాపురప్పాడులో శనివారం ఓ వ్యక్తి కాలిన గాయాలతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వినయ కుమార్‌ (44) శుక్రవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మరణించారు. సిగరెట్‌ తాగుతున్న సమయంలో మంటలు అంటుకుని ఉంటాయని మృతుడి కుమార్తె పవిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సునీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 11, 2026

పోలవరం స్పిల్‌వేకు ద్రవిడియన్ తోరణాలు!

image

AP: పోలవరం తొలిదశను 2027 ఉగాది నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు గతంలో అనుకున్న జూన్ లక్ష్యాన్ని మార్చి నాటికి కుదించాలని అధికారులకు ఆదేశించారు. దీనికి నిర్మాణ సంస్థ మేఘా సైతం అంగీకరించింది. ఇదే సమయంలో పోలవరం స్పిల్‌వేను ద్రవిడియన్ శైలిలో ఉన్న తోరణాలతో అలంకరించేందుకు డిజైన్లను సదరు సంస్థ CMకు చూపించింది. వీటిపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.