News March 9, 2025
PMJ జ్యువెల్స్ – అతిపెద్ద వెడ్డింగ్ & హాఫ్ శారీ, జ్యువెలరీ ఎగ్జిబిషన్

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ PMJ జువెల్స్ హైదరాబాద్‌లోనే అతిపెద్ద వెడ్డింగ్ & హాఫ్ శారీ ఎగ్జిబిషన్‌ను తాజ్ కృష్ణలో శుక్రవారం ప్రారంభించింది. ఇందులో సంప్రదాయం, ఆధునికత కలబోతతో కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 20,000+ ఆభరణాలు అందుబాటులో ఉన్నట్లు మేనేజ్మెంట్ తరపున ప్రతీక్ జైన్ తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన ఎగ్జిబిషన్ ఆదివారం ముగియనుందని, కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News January 3, 2026
HYD: యువతలో సరికొత్త క్రేజ్.. ‘ఫాల్కన్ విస్పర్స్’!

నగర యువత (Gen-Z) పార్టీల పేరుతో మద్యం, సందడికి దూరంగా ‘ఫాల్కన్ విస్పర్స్’ అనే వినూత్న ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. శంషాబాద్ తోటల్లో గుట్టుగా కలుస్తూ ఒత్తిడిని వీడటమే దీని లక్ష్యం. 800 మంది సభ్యులున్న డెక్కన్ షాడోస్ టెలిగ్రామ్ గ్రూపు దీనికి వేదికైంది. ఇక్కడ సెల్ఫీలు ఉండవు. కేవలం మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా ఏకాగ్రత 35% పెరుగుతుందని యువత నమ్ముతున్నారు. ఈ ‘సోబర్’ మీటింగ్స్ ఇప్పుడు హాట్ టాపిక్!
News January 3, 2026
HYD: లీకేజీలను గుర్తించేంచుకు ‘రోబోటిక్’ టెక్నాలజీ

HYDలో కలుషిత నీటి సరఫరాను అరికట్టేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. గత రెండేళ్లలో అందిన ఫిర్యాదులను విశ్లేషించి, కలుషిత నీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో రెండు నెలల్లోగా పాత పైప్‌లైన్లను మార్చాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. లీకేజీలను త్వరితగతిన గుర్తించేందుకు ‘రోబోటిక్ టెక్నాలజీ’ని వాడుతున్నారు. ఫిర్యాదులను ‘జీరో’ స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు పనులు చేపట్టారు.
News January 3, 2026
లింగంపల్లి-ఉప్పల్: నిధుల కరవు.. అధికారాల పరువు!

శేరిలింగంపల్లి నుంచి ఉప్పల్ దాకా అతుకుల రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీలే దర్శనమిస్తున్నాయి. సుమారు రూ. 14,725 కోట్ల పనులు పెండింగ్‌లో ఉండటంతో ప్రతి వానాకాలం వేలాది కుటుంబాలు ముంపులోనే బతుకుతున్నాయి. విచిత్రమేంటంటే.. ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్లకు రూ. 5 లక్షలకు మించి ఖర్చు చేసే అధికారం లేదు. అంటే, ఒక చిన్న డ్రైనేజీ కాలువ పూడిక తీయాలన్నా పైస్థాయి నుంచి <<18752122>>పచ్చజెండా<<>> రావాల్సిందే.


