News June 17, 2024

బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన PMO

image

పశ్చిమ బెంగాల్‌‌లో రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితులకు ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వనున్నారు. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఈ ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా 60మంది గాయపడ్డారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Similar News

News March 31, 2026

జూనియర్ కాలేజీలకు సెలవులే సెలవులు

image

AP:ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఇందులో 2026-27లో APR-MAR వరకు 314 రోజులకు గాను 232 వర్కింగ్ డేస్‌గా చూపింది. ఇక సండే, 2వ శనివారాలు, పబ్లిక్ హాలిడేస్, పండగలకు 82 రోజులు సెలవుగా పేర్కొంది. OCTలో దసరాతో సహా 14 రోజులు, JANలో సంక్రాంతితో కలిపి 13 రోజులు సెలవు ఇస్తారు. వీటికి అదనంగా ఏటా APR24 నుంచి MAY31 వరకు 38 రోజులు సమ్మర్ సెలవులుంటాయి. మొత్తంగా 120 రోజులు సెలవులే.

News March 31, 2026

రోహిత్ శర్మ ₹214 కోట్ల సామ్రాజ్యం

image

రోహిత్ శర్మ కేవలం గ్రౌండ్‌లోనే కాదు బయట కూడా ‘హిట్ మ్యాన్’లాగే బతుకుతున్నారు. ₹214 కోట్ల నెట్‌వర్త్ ఉన్న ఈ క్రికెటర్ ముంబైలో లగ్జరీ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అహుజా టవర్స్‌లో ఉన్న ఈ ఇంటి నుంచి సీ-వ్యూ అద్భుతంగా ఉంటుంది. మోడ్రన్ ఇంటీరియర్స్, పీస్‌ఫుల్ గార్డెన్, క్లాసీ పూజా ఏరియాతో ఈ ఇల్లు కలల సౌధాన్ని తలపిస్తుంది. క్రికెట్‌తో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఆయన రేంజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి.

News March 31, 2026

BIG ALERT: వడగళ్ల వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల <<19520557>>వర్షాలు<<>> కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం 8.30 గంటలలోపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వానలు పడే ఛాన్స్ ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించింది.