News August 11, 2025

నేడు PM ఫసల్ బీమా నిధుల జమ

image

నేడు దేశ వ్యాప్తంగా 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో PM ఫసల్ బీమా యోజన కింద రూ.3,200 కోట్లు జమ కానున్నాయి. రాజస్థాన్‌‌లో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం 2016లో ప్రారంభం కాగా, రైతులు ఖరీఫ్ పంటలకు 2శాతం, రబీ పంటలకు 1.5శాతం, వాణిజ్య పంటలకు 5శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ప్రీమియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.

Similar News

News August 20, 2025

కేబుల్, ఇంటర్నెట్ వైర్ల తొలగింపునకు బ్రేక్!

image

HYDలో కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ప్రభుత్వం <<17454341>>తొలగిస్తున్న<<>> విషయం తెలిసిందే. దీనిపై కేబుల్ ఆపరేటర్లు TG SPDCL CMDతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కేబుల్, ఇంటర్నెట్ వైర్లను కట్ చేయొద్దని TG SPDCL నిర్ణయం తీసుకున్నట్లు ఆపరేటర్లు తెలిపారు. నిరుపయోగంగా ఉన్న వైర్లను తొలగించాలని, రన్నింగ్‌లో ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ఒకే బంచింగ్ విధానంలో తీసుకురావాలని CMD సూచించారని పేర్కొన్నారు.

News August 20, 2025

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో మోక్షజ్ఞ ఎంట్రీ: నారా రోహిత్

image

నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ అతి త్వరలో ఉంటుందని హీరో నారా రోహిత్ తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు అతడు ఆసక్తిగా ఉన్నాడన్నారు. ‘ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ కోసం వెతుకుతున్నట్లు మోక్షజ్ఞ చెప్పాడు. అలాంటి కథ ఉంటే ఈ ఏడాదిలోనే ఎంట్రీ ఉండొచ్చు. మూవీల కోసమే తన లుక్ మొత్తం మార్చేసుకున్నాడు’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అటు బాలయ్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని రోహిత్ చెప్పారు.

News August 20, 2025

బిల్లుపై భిన్నాభిప్రాయాలు!

image

ఏదైనా నేరం కింద పీఎం, సీఎం, మినిస్టర్లు అరెస్ట్ అయి 30 రోజుల పాటు జైలులో ఉంటే పదవుల నుంచి తొలగించే బిల్లుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చట్టం వల్ల నేరాలు చేయాలనే ఆలోచన రాజకీయ నాయకుల మదిలో నుంచి తొలగిపోతుందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో చేయని నేరానికి 30 రోజులు జైలులో ఉంచి, పదవిని పోగొట్టే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ బిల్లుపై మీ కామెంట్?