News November 5, 2025

PNBలో 750 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 750 పోస్టులకు 20-30 ఏళ్ల మధ్య ఉన్న గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ నవంబర్ 23. ఇక్కడ <>క్లిక్<<>> చేసి నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు.

Similar News

News November 5, 2025

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 పోస్టులు

image

<>పంజాబ్<<>> నేషనల్ బ్యాంక్ 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో TGలో 88, APలో 5 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 23వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: pnb.bank.in/

News November 5, 2025

ఉసిరి దీపాన్ని ఎలా తయారుచేసుకోవాలి?

image

కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపాన్ని వెలిగించడానికి గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగంలో గుండ్రంగా కట్ చేయాలి. ఆ భాగంలో స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి వేయాలి. ఆ నూనెలో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకం.

News November 5, 2025

ఉపరితల ఆవర్తనంతో ఈ జిల్లాల్లో వర్షాలు!

image

కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ APలోని కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, కడప, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలో ఇవాళ్టితో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వర్షాలు ముగుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.