News October 20, 2024
మహిళా నిర్మాతలపై పోక్సో కేసు

సీరియల్స్, వెబ్ సిరీస్‌లు నిర్మించే ‘బాలాజీ టెలీఫిలిమ్స్’ నిర్మాతలు శోభా కపూర్, ఏక్తా కపూర్‌పై ముంబై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ‘ఆల్ట్ బాలాజీ’ సంస్థ నిర్మాణంలో వీరు ‘ఏ’ రేటెడ్ వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తున్నారు. 2021లో స్ట్రీమ్ అయిన ‘గందీ బాత్’ అనే సిరీస్‌లో బాలికల్ని అశ్లీలంగా చూపించారంటూ వారిపై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలోనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 20, 2025
అత్యధిక కాలం సీఎంగా పనిచేసింది వీరే..

దేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వారి జాబితాలో పవన్ కుమార్ చామ్లింగ్(సిక్కిం-24 ఏళ్లు) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో నవీన్ పట్నాయక్(ఒడిశా-24 ఏళ్లు), జ్యోతి బసు(పశ్చిమబెంగాల్-23 ఏళ్లు), గెగాంగ్ అపాంగ్(అరుణాచల్ ప్రదేశ్-22 ఏళ్లు), లాల్ థన్హవ్లా(మిజోరం-22 ఏళ్లు), వీరభద్ర సింగ్(హిమాచల్ ప్రదేశ్-21 ఏళ్లు), మాణిక్ సర్కార్(త్రిపుర-19 ఏళ్లు), నితీశ్ (బిహార్-19 ఏళ్లు) ఉన్నారు.
News November 20, 2025
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా?

AP: నిధులు జమకాని రైతులు annadathasukhibhava.ap.gov.in వెబ్సైట్లో Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. ఆధార్ నంబర్, పక్కన క్యాప్చా ఎంటర్ చేయాలి. సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అందిన మొత్తం, తేదీ, ట్రాన్సాక్షన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. సక్సెస్ అంటే డబ్బు జమైందని అర్థం. Pending/Rejected అంటే ఇంకా జమ కాలేదు, నిరాకరించబడిందని అర్థం. మీకు ఏమైనా సందేహాలుంటే గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి.
News November 20, 2025
405Kmph.. రికార్డులు బద్దలు కొట్టిన మెలిస్సా

కరీబియన్ దీవులను ధ్వంసం చేసిన <<18174610>>మెలిస్సా<<>> హరికేన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 252mph(405Kmph) వేగంతో విరుచుకుపడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది అత్యంత శక్తిమంతమైన హరికేన్ వేగమని NSF NCAR వెల్లడించింది. జమైకా వైపు దూసుకెళ్తున్న సమయంలో ఈ రికార్డు నమోదైంది. 2010లో తైవాన్ సమీపంలో టైఫూన్ మెగీ నమోదు చేసిన 248mph రికార్డును మెలిస్సా అధిగమించింది. దీని ప్రభావంతో 70 మందికిపైగా మృతి చెందారు.


