News March 17, 2024

అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పొదెం వీరయ్య

image

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పదవి దక్కింది. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకుడిగా పొదెం గుర్తింపు పొందారు. పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఏకతాటిపై నడిపించారు. 

Similar News

News November 30, 2025

నేలకొండపల్లి: యువ రైతు ఆత్మహత్య

image

నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో అప్పుల బాధ భరించలేక యువ కౌలు రైతు గడ్డి మందు తాగాడు. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరు(27) 15 ఎకరాల కౌలు భూమి సాగు చేశాడు. పంట దిగుబడి సరిగా లేకపోవడంతో చేసిన రూ.20లక్షల అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఏడాది వయసున్న కొడుకు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 29, 2025

ఖమ్మం: దీక్షా దివస్‌కు నేటితో 16 ఏళ్లు పూర్తి: సండ్ర వెంకట వీరయ్య

image

ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన దీక్షకు నేటితో 16 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

News November 29, 2025

ఖమ్మం: NMMS పరీక్షా కీ.. అభ్యంతరాలు డిసెంబర్ 6లోపు సమర్పించండి: DEO

image

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) 8వ తరగతి పరీక్షా కీపై అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 6వ తేదీలోపు సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి చైతన్య జైని తెలిపారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న కీని పరిశీలించి, అభ్యంతరాలను డైరెక్టర్ ప్రభుత్వ పరీక్షలు, తెలంగాణకు నేరుగా సమర్పించాలని, గడువు తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించబోమని డీఈఓ స్పష్టం చేశారు.