News September 3, 2025
కవిత.. ఇది పద్ధతి కాదు: నిరంజన్ రెడ్డి

TG: బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో హరీశ్ రావు పాత్ర మరువలేనిదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. గతంలో హరీశ్‌ను పొగిడిన వారు, ఇప్పుడు విమర్శిస్తున్నారని చెప్పారు. <<17599925>>కవిత<<>> రివర్స్ గేర్ ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదన్నారు. రేవంత్ కాళ్లు మొక్కి హరీశ్ సరెండర్ అయ్యారంటూ నీచమైన ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. దీని వెనుక ఏం జరిగిందో తెలియట్లేదని, ఇది పద్ధతి కాదన్నారు.
Similar News
News September 3, 2025
ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గీ, జొమాటో

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో తమ కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. ప్లాట్‌ఫామ్ ఫీజులను భారీగా పెంచాయి. స్విగ్గీ దీన్ని మూడు రెట్లు పెంచుతూ ఆర్డర్‌కు రూ.15 చేసింది. GSTతో కలిపి ఈ అమౌంట్‌ను వసూలు చేయనుంది. జొమాటో 20% పెంచుతూ రూ.12 చేసింది. దీనికి GST అదనం. స్విగ్గీ నిత్యం 20 లక్షల ఆర్డర్లు డెలివరీ చేస్తుండగా, జొమాటో 23-25 లక్షల వరకు చేస్తోంది.
News September 3, 2025
ఇది సార్.. ధోనీ ‘బ్రాండ్’

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా క్రికెటర్ ధోనీ బ్రాండ్ వాల్యూ తగ్గలేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అత్యధిక బ్రాండ్లకు(43) అంబాసిడర్‌గా వ్యవహరించిన భారతీయ సెలబ్రిటీ ఆయనే అని TAM AdEx తెలిపింది. షారుఖ్(35), అమితాబ్(28), దీపికా(23) తర్వాతి స్థానాల్లో ఉన్నారని పేర్కొంది. కాగా TVయాడ్స్‌లో రోజులో ఎక్కువగా కనిపించే సెలబ్రిటీల్లో షారుఖ్, ధోనీ తొలి రెండు స్థానాల్లో ఉన్నారని వెల్లడించింది.
News September 3, 2025
AP న్యూస్ రౌండప్

* తురకపాలెం <<17599008>>మరణాలపై<<>> మంత్రి సత్యకుమార్ ఫోకస్.. ఫీవర్, ఇన్ఫెక్షన్ కేసులపై ఆరా తీస్తున్న వైద్యబృందం
* టీటీడీ ఆసుపత్రుల్లో సేవ చేసేందుకు భక్తులకు అవకాశం: బీఆర్ నాయుడు
* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం: బొత్స సత్యనారాయణ
* ముగిసిన ఐపీఎస్ అధికారి సంజయ్ రెండో రోజు ACB కస్టడీ.. విజయవాడ జైలు అధికారులకు అప్పగింత