News March 7, 2025
POK స్వాధీనం: మోదీ సర్కారు బిగ్ ప్లానింగ్!

POK స్వాధీనంపై మోదీ సర్కారు గురిపెట్టిందని నిపుణుల అంచనా. వారు ఉదహరిస్తున్న జియో పొలిటికల్ ఈవెంట్లు ఇవే. అంతర్గత వివాదాలతో అట్టుడుకుతున్న పాక్ నుంచి బలూచిస్థాన్ స్వతంత్రం ప్రకటించుకొనే అవకాశముంది. తాలిబన్లు డ్యూరాండ్ రేఖను ఆక్రమిస్తున్నారు. కార్గిల్లో భారత్ అతిపెద్ద యుద్ధ విమానాన్ని దించింది. POK స్వాధీనంతో కశ్మీర్ సమస్య అంతమవుతుందని లండన్లో జైశంకర్ అన్నారు. మరి ఎవరు ఆపారని JK CM ప్రశ్నించారు.
Similar News
News December 4, 2025
పంటను బట్టి యూరియా వాడితే మంచిది

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.
News December 4, 2025
త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్కు రాహుల్ గాంధీ!

AP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శిస్తారని AICC అధికార ప్రతినిధి సునీల్ అహీరా తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోహినూర్ వజ్రం లాంటిదని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇచ్చిన ప్లాంటును బీజేపీ అదానీకి అమ్మేస్తోందని, దాన్ని అడ్డుకుంటామని తెలిపారు. అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.
News December 4, 2025
32వేల మంది టీచర్లకు ఊరట

పశ్చిమ బెంగాల్లో 32వేల మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఆ నియామకాలు చెల్లుబాటు అవుతాయని తీర్పునిచ్చింది. 2014లో టెట్ ద్వారా టీచర్లుగా నియమితులైన అందరూ అక్రమంగా ఉద్యోగాల్లో చేరినట్లు దర్యాప్తులో తేలలేదని కోర్టు పేర్కొంది. 264 మంది మాత్రమే అలా చేరారని, వీరి కోసం 32వేల మంది రిక్రూట్మెంట్ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది.


