News November 19, 2024

రాష్ట్రానికి పోలవరం గేమ్ ఛేంజర్: చంద్రబాబు

image

AP: పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఓ గేమ్ ఛేంజర్ అని CM చంద్రబాబు అన్నారు. ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి వెన్నెముక, జీవనాడి అని చెప్పారు. ‘నదుల అనుసంధానం రాష్ట్రానికి ముఖ్యం. గతంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను గోదావరికి అనుసంధానం చేశాం. దీని ద్వారా మిగులు జలాలను రాయలసీమకు తరలించాం. 7 మండలాలు APలో కలపకపోయి ఉంటే పోలవరం ఎప్పటికీ కష్టమే. అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు’ అని పేర్కొన్నారు.

Similar News

News October 28, 2025

ప్రతిరోజూ మహిళల కోసం స్పెషల్ కంటెంట్

image

Way2Newsలో మహిళల కోసం ప్రత్యేకంగా ‘వసుధ’ కేటగిరీని ప్రవేశపెట్టాం. ఇందులో ప్రతి రోజూ ఉమెన్ హెల్త్, ప్రెగ్నెన్సీ, బ్యూటీ, హెయిర్ కేర్ టిప్స్, వంటింటి చిట్కాలు, ఫ్యాషన్, స్ఫూర్తిదాయక కథనాలు, చైల్డ్ కేర్, పేరెంటింగ్‌పై ఆర్టికల్స్ అందుబాటులో ఉన్నాయి.
* స్క్రీన్‌పై క్లిక్ చేసి కింది భాగంలో కేటగిరీలు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లవచ్చు. కేటగిరీలు కన్పించలేదంటే యాప్ అప్డేట్ చేసుకోండి.

News October 28, 2025

లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత

image

TG: మల్లోజుల, ఆశన్న బాటలోనే మావోయిస్టు కీలక నేత లొంగిపోయారు. 45 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్న రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ ఇవాళ DGP శివధర్ రెడ్డి ఎదుట సరెండర్ అయ్యారు. మంచిర్యాల(D) మందమర్రికి చెందిన ఆయన సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ 1980లో పీపుల్స్‌ వార్‌ ఉద్యమాలకు ఆకర్షితుడయ్యారు. 1984లో AITUC నేత అబ్రహం హత్య కేసులో అరెస్టై ADB సబ్ జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు.

News October 28, 2025

తుఫాన్ బాధితుల్ని ఆదుకునే తీరు ఇదేనా: YCP

image

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కనిపించట్లేదని YCP ఆరోపిస్తోంది. ‘మంత్రి కందుల దుర్గేశ్ నియోజకవర్గంలోనే పునరావాస కేంద్రాలు కనిపించట్లేదు. కలెక్టర్ ఆదేశాలిచ్చినా అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు. తుఫాన్ బాధితుల్ని ఆదుకునే తీరు ఇదేనా? విజయనగరం జిల్లా గుర్లలో తుఫానుతో వరి పంట నేలకొరిగింది. రైతుల్ని పరామర్శించడం కాదు కదా.. కనీసం కూటమి నేతలు పట్టించుకోవట్లేదు’ అని ట్వీట్ చేసింది.