News November 19, 2024

2027లోపు పోలవరం పూర్తి: CM చంద్రబాబు

image

AP: పోలవరం ప్రాజెక్టును 2027లోపు పూర్తి చేస్తామని CM చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ‘నదుల అనుసంధానం పూర్తి చేయాలనేది నా జీవిత ఆశయం. గోదావరి నుంచి 4215 టీఎంసీలు, కృష్ణా నది నుంచి 815 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. గత ప్రభుత్వ హయాంలో పోలవరం గురించి అడిగితే పర్సెంటా.. అర పర్సెంటా అని అవహేళన చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కచ్చితంగా 45.72మీటర్లు ఉంటుంది’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Similar News

News November 15, 2025

రెండో రోజు CII సదస్సు ప్రారంభం

image

AP: విశాఖలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న రేమండ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇవాళ దేశ విదేశాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతారు.

News November 15, 2025

తన గమ్యమేంటో జడేజాకు తెలుసు: రవిశాస్త్రి

image

తన ఫ్యూచర్‌(IPL)పై బయట జరుగుతున్న చర్చతో ఆల్‌రౌండర్ జడేజా ఫోకస్ దెబ్బతిందన్న వ్యాఖ్యలపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘అతని తర్వాతి డెస్టినేషన్, సంపాదన ఎంత అనే అంశాలపై అంతా ఆసక్తిగా ఉంటారు. జడేజా ఎంతో అనుభవజ్ఞుడు. టాప్ క్లాస్ క్రికెటర్. తన గమ్యం, క్రికెట్‌పై చాలా ఫోకస్డ్‌గా ఉంటాడు. బయట విషయాలు క్రికెట్‌పై అతనికున్న ఫోకస్‌ను దెబ్బతీయలేవు’ అని SAతో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అన్నారు.

News November 15, 2025

కాకరలో బూడిద తెగులు.. నివారణకు సూచనలు

image

వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కాకర పంటలో బూడిద తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పంటకు ఈ తెగులు సోకితే ఆకులపై బూడిద వంటి పొర ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైనోకాప్ 2 మి.లీ (లేదా) మైక్లోబ్యుటానిల్ 0.4 గ్రాములను కలిపి 7 నుంచి 10 రోజుల్లో 2, 3 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.