News November 12, 2024
2027 లేదా 2028 నాటికి పోలవరం పూర్తి: సీఎం
AP: పోలవరం ప్రాజెక్టును 2027 లేదా 2028 నాటికి పూర్తి చేస్తామని NDA శాసనసభాపక్ష సమావేశంలో CM చంద్రబాబు వెల్లడించారు. ‘ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.12,500 కోట్లు ఇచ్చింది. దీంతో ఫేజ్-1 ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఫేజ్-2లో R&R, భూసేకరణ సమస్యలు పరిష్కరిస్తాం. ఈ ఏడాది పోలవరం నుంచి అనకాపల్లి, విశాఖకు నీళ్లు తీసుకెళ్తాం. అనంతరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధారకు అనుసంధానం చేస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 14, 2024
ఇవాళ్టి నుంచి లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్
AP: లా కాలేజీల్లో ప్రవేశాల కోసం రెండో విడత <
News November 14, 2024
CRICKET: వింత కారణాలు.. నిలిపివేతలు!
క్రికెట్ మ్యాచ్లు ప్రధానంగా వర్షం, వెలుతురు సరిగా లేకపోవడం వల్ల ఆలస్యం లేదా నిలిచిపోతుంటాయి. సౌతాఫ్రికాలో ఇండియా తాజాగా ఆడిన టీ20 పురుగుల వల్ల కాసేపు నిలిచిపోయింది. SAలోనే 2017లో తేనెటీగల దాడి వల్ల శ్రీలంకతో మ్యాచ్, 2017లో హలాల్ ఫుడ్ అందుబాటులో లేదని బంగ్లాదేశ్తో మ్యాచ్ నిలిచిపోయాయి. వీటన్నింటికంటే వింతగా పాకిస్థాన్లో 1996లో PCB బంతులు సప్లై చేయకపోవడంతో NZతో టెస్టు 20ని.లు ఆలస్యమైంది.
News November 14, 2024
ఇద్దరికి మించి పిల్లలున్న వారూ అర్హులే
AP: ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇకపై అర్హులే. దానికి సంబంధించిన నిబంధనకు సవరణ చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. అప్పట్లో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తిస్తూ చట్టం చేశారు. ఇప్పుడు సంతానోత్పత్తి తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.