News June 28, 2024
జగన్ వల్లే పోలవరం విధ్వంసం: సీఎం చంద్రబాబు

AP: 2014లో రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే ఐదేళ్ల జగన్ పాలన వల్లే ఎక్కువ డ్యామేజ్ జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. దీనికి పోలవరం విధ్వంసం ఒక ఉదాహరణ అని చెప్పారు. తమ హయాంలో 73% పనులను పూర్తి చేస్తే.. YCP పాలనలో 4% కూడా పూర్తవలేదని ఆరోపించారు. జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని, ఇక రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
రూ.లక్ష కోట్లకు Groww

స్టాక్ బ్రోకింగ్ సంస్థ Groww పేరెంట్ కంపెనీ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్లో అదరగొట్టింది. వరుసగా నాలుగు రోజులు లాభాలు సాధించింది. ఇవాళ షేర్ వాల్యూ మరో 13 శాతం పెరిగి అత్యధికంగా రూ.169.79కి చేరింది. ఇష్యూ ధర రూ.100తో పోలిస్తే దాదాపు 70 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.05 లక్షల కోట్లను తాకింది.
News November 17, 2025
OFFICIAL: ఎల్లుండి అకౌంట్లలోకి రూ.7,000

AP: ఈ నెల 19న పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్నూ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రెండో విడతలో రాష్ట్ర వాటా రూ.5వేలు, కేంద్రం వాటా రూ.2వేలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేస్తారన్నారు. మొత్తంగా 46,62,904 మంది రైతులకు రూ.3,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు.
News November 17, 2025
సౌదీ ప్రమాదంలో భారతీయులు చనిపోవడం బాధాకరం: మోదీ

సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మదీనాలో జరిగిన ఈ ఘటనలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రియాద్లోని భారత రాయబార కార్యాలయం & జెడ్డాలోని కాన్సులేట్ సాధ్యమైనంత సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సౌదీ అధికారులతో సమీక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.


