News June 14, 2024
ఆడపిల్లలున్న తల్లులకు పోలీసుల విజ్ఞప్తి!

ఎంతో మంది చిన్నారులు లైంగిక దాడులను ఎదుర్కొంటున్నప్పటికీ ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతుంటారు. ఈక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ తల్లులకు అవగాహన కల్పిస్తోంది. ప్రతి తల్లి తమ పిల్లల ప్రవర్తనను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలని సూచించింది. తమతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించారని చెబితే అబద్ధం అనుకోకుండా నిజాలు తెలుసుకోవాలని కోరింది. బాధితులకు అండగా ఉంటామని, సమస్య ఉంటే డయల్ 100కి కాల్ చేయాలని సూచించింది.
Similar News
News September 15, 2025
విడాకులు తీసుకున్న వారితో నాకు పెళ్లి అనేవారు: మీనా

తనపై గతంలో వచ్చిన వార్తలను జగపతి బాబు షోలో సీనియర్ నటి మీనా గుర్తు చేసుకున్నారు. ‘అప్పుల్లో ఉన్నామని తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవాలని నిర్మాతలు అడిగేవారు. అలా తీసిన సినిమాలు హిట్ అయ్యాక నన్ను మర్చిపోయేవాళ్లు. వరుస అవకాశాలు ఉన్నప్పటికీ నేను పెళ్లి చేసుకున్నాను. 2022లో భర్తను కోల్పోయాక ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని వార్తలొచ్చేవి. అవి చూసినప్పుడు బాధేసేది’ అని చెప్పారు.
News September 15, 2025
లిక్కర్ స్కాం: మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్

మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ ఇవాళ మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ప్రమేయంపై వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. తాజాగా దాఖలు చేసిన రెండో అనుబంధ అభియోగపత్రంతో కలిపి ఇప్పటి వరకు సిట్ మొత్తం మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసినట్లయింది.
News September 15, 2025
కాలేజీలు యథావిధిగా నడపండి: సీఎం రేవంత్

TG: కాలేజీల బకాయిలు విడతల వారీగా చెల్లించేందుకు సానుకూలంగా ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని, కాలేజీలు యథావిధిగా నడిపించాలని యూనియన్ నాయకులను ఆయన కోరారు. కళాశాలల సమస్యలు, యాజమాన్యాలు చేస్తున్న డిమాండ్లపై సీఎంతో భట్టి, శ్రీధర్ బాబు భేటీ ముగిసింది. ఈ సాయంత్రం యూనియన్ నాయకులతో మంత్రులు చర్చించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.