News November 27, 2024
RGV కోసం పోలీసుల ముమ్మర గాలింపు
సోషల్ మీడియాలో పోస్టుల కేసులో డైరెక్టర్ RGV కోసం AP పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పలు బృందాలుగా ఏర్పడి తెలంగాణ, తమిళనాడు, కేరళలో వెతుకుతున్నారు. కాగా ఆర్జీవీ నిన్న ఓ వీడియో విడుదల చేశారు. తాను భయపడి పారిపోలేదని, సినిమా షూటింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు. మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది.
Similar News
News November 27, 2024
ఇథనాల్ పరిశ్రమ పనులు ఆపేయాలని కలెక్టర్ ఆదేశాలు
TG: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ వద్ద ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. దిలావర్‌పూర్ గ్రామస్థులతో ఆమె చర్చలు జరిపారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చానని, సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వారికి చెప్పారు.
News November 27, 2024
అదానీ అంశంపై క్యాబినెట్‌లో చర్చిస్తాం: పవన్
AP: అదానీ వ్యవహారంపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఢిల్లీలో పీఎం మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. మోదీతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలు పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని మీడియాతో పవన్ చెప్పారు.
News November 27, 2024
రూ.40 వేల కోట్లు వదిలేసుకుని..
వెన్ అజాన్ సిరిపన్యో బౌద్ధ సన్యాసి. ఇతని తండ్రి ఆనంద కృష్ణన్ మలేషియాలోని టాప్-3 ధనవంతుల్లో ఒకరు కాగా తల్లిది థాయ్ రాయల్ ఫ్యామిలీ. 18ఏళ్ల వయసులో థాయ్‌లాండ్ వెళ్లిన సిరిపన్యో సరదాగా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆపై దానికే జీవితాన్ని అంకితం చేసి రూ.40వేల కోట్ల వారసత్వ ఆస్తిని త్యజించాడు. అప్పుడప్పుడు కుటుంబాన్నికలిసే సిరిపన్యో పాత జీవితం తాత్కాలికమైందని చెబుతుంటారంట. ఇతనికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు.