News April 9, 2025

YS జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం: పోలీసుల సంఘం

image

AP: టీడీపీ అనుకూల పోలీసులను చట్టం ముందు బట్టలూడదీసి నిలబెడతామన్న <<16030703>>YS జగన్ వ్యాఖ్యలను<<>> పోలీసు అధికారుల సంఘం ఖండించింది. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే న్యాయపోరాటం చేస్తామని తెలిపింది. పోలీసుల్లో మహిళలు కూడా ఉన్నారని జగన్ మరిచారా అని ప్రశ్నించింది. తీవ్ర ఒత్తిడి ఉన్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు తగవని పేర్కొంది.

Similar News

News January 29, 2026

50 పరుగుల తేడాతో భారత్ ఓటమి

image

విశాఖలో జరిగిన 4వ T20లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. ఒకానొక సమయంలో దూబె(65) చెలరేగి ఆడటంతో గెలుపు దిశగా పయనించింది. అతను ఔటవ్వగానే కావాల్సిన రన్‌రేట్ పెరిగిపోయి 50 పరుగుల తేడాతో ఓడింది. శాంట్నర్ 3, సోధీ, డఫీ చెరో 2 వికెట్లు తీశారు.

News January 28, 2026

T-మున్సి‘పోల్స్’.. రంగంలోకి BJP అగ్రనేతలు!

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా BJP రాష్ట్ర నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, హోం మంత్రి అమిత్ షాను ప్రచారానికి రావాలని ఆహ్వానించారు. FEB 2,3న మహబూబ్‌నగర్‌లో నితిన్ నబీన్, 8,9 తేదీల్లో నిర్మల్‌లో అమిత్‌షా సభ నిర్వహించాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారని తెలుస్తోంది. అగ్ర నేతల పర్యటనపై 2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

News January 28, 2026

రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదు

image

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదైంది. <<18445119>>హిందువుల<<>> మనోభావాలు దెబ్బతీశారని ఓ లాయర్ బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల క్రితం కాంతార చాప్టర్-1 మూవీ ఈవెంట్‌లో రణ్‌వీర్ దైవానికి సంబంధించిన సన్నివేశాన్ని ఇమిటేట్ చేసి కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.