News September 4, 2024

నందిగం సురేశ్ ఇంటికి పోలీసులు

image

AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఇంటికి పోలీసులు వెళ్లారు. టీడీపీ ఆఫీస్‌, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆయన బెయిల్ పిటిషన్ <<14019866>>తిరస్కరణకు<<>> గురైంది. దీంతో సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే సురేశ్ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.

Similar News

News February 3, 2025

ట్రంప్ సుంకాలు.. ఆందోళన లేదు: ఆర్థిక మంత్రి నిర్మల

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘సుంకాల గురించి ఎలాంటి ఆందోళనా లేదు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. పరోక్షంగా ప్రభావం ఉండొచ్చు. మా ప్రధాన లక్ష్యం ఆత్మనిర్భరతే’ అని పేర్కొన్నారు.

News February 3, 2025

నిధులు కేటాయించండి: పనగరియాకు చంద్రబాబు విజ్ఞప్తి

image

ఢిల్లీ పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అర్వింద్ పనగరియాను ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై ఆయనతో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం, నిధుల కేటాయింపులో పెద్ద మనస్సు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసిందని పనగరియా వద్ద నేతలు ప్రస్తావించారు.

News February 3, 2025

SECకి వైసీపీ ఫిర్యాదు

image

AP: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పదవుల కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తిరుపతి, హిందూపురం, నెల్లూరులో వైసీపీ కార్పొరేటర్లపై కూటమి నేతలు దాడి చేశారని, ఆ ఎన్నికలను వాయిదా వేయాలని విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్నికి వైసీపీ నేతలు వినతిపత్రం అందించారు.