News December 13, 2024

రూట్ క్లియర్ చేస్తున్న పోలీసులు

image

మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్‌ను వైద్యపరీక్షల కోసం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. ఈమేరకు రూట్ క్లియర్ చేస్తున్నారు.

Similar News

News November 7, 2025

కరివేపాకు సాగు.. పొలం తయారీ, నాటే విధానం

image

కరివేపాకు సాగు చేయదలచే రైతులు విత్తనాన్ని నేరుగా భూమిలో నాటడం వల్ల మొక్క పెరుగుదలలో లోపాలు రావొచ్చు. దీనికి బదులు 1 నుంచి 1.5 సంవత్సరాల మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందొచ్చు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45X45X45 సెం.మీ గుంతలను 1X1 మీటర్ల దూరంలో తీయాలి. ప్రతి గుంతకు పశువుల ఎరువు 10 కిలోల చొప్పున వేయాలి. ఒక హెక్టారుకు 10వేల మొక్కలను నాటుకోవచ్చు.

News November 7, 2025

దక్షిణ మధ్య రైల్వేలో 61 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>దక్షిణ మధ్య రైల్వే<<>>లో స్పోర్ట్స్ కోటాలో 61 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు NOV 24వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. అంతర్జాతీయ క్రీడల్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో పతకాలు సాధించినవారు అర్హులు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్రీడల్లో ప్రావీణ్యత, విద్యార్హత ఆధారంగా ఎంపిక చేస్తారు.

News November 7, 2025

తరచూ ఛాతి ఎక్స్‌రేలు తీయించుకుంటున్నారా?

image

చాలామంది వార్షిక హెల్త్ చెకప్స్‌లో రక్త పరీక్షలతో పాటు ఎక్స్‌రేలు చేయించుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తులు చెస్ట్ ఎక్స్-రేలు తీసుకోనక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఎక్స్-రేలు తరచూ తీయించుకుంటే రేడియేషన్‌కు గురవుతారు. ఇది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. దగ్గు, జ్వరం, టీబీ వంటి అనారోగ్యం బారిన పడినవారు వైద్యుల సూచనతో తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.