News December 1, 2024
రూ.10 కోసం పోలీసులకు ఫిర్యాదు!

రూ.10 బాకీ పడిన మనిషి ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని ఓ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించిన ఆసక్తికర ఘటన ఇది. UPలోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర పాన్ షాప్ నడుపుకుంటున్నారు. సంజయ్ అనే కస్టమర్ ఏడాదిన్నర క్రితం గుట్కా ప్యాకెట్ కొని రూ.10 అరువు పెట్టాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని విసిగిపోయిన జితేంద్ర, పోలీస్ హెల్ప్‌లైన్ 112కి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి సంజయ్ నుంచి రూ.10ని జితేంద్రకి ఇప్పించారు.
Similar News
News January 6, 2026
నేటి నుంచి మలేషియా ఓపెన్

గత ఏడాది నిరాశపరిచిన భారత షట్లర్లు కొత్త సీజన్‌కు సిద్ధమయ్యారు. నేటి నుంచి జరిగే మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక, ఉన్నతీ హుడా, డబుల్స్‌లో పుల్లెల గాయత్రీ-ట్రీసా జాలీ, మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ పోటీ పడనున్నారు. అక్టోబర్ తర్వాత సింధు ఆడుతున్న టోర్నీ ఇదే కావడంతో ఆమె ఎలా రాణిస్తారో చూడాలి.
News January 6, 2026
బిట్‌కాయిన్ స్కామ్.. శిల్పా శెట్టి భర్తకు కోర్టు నోటీసులు

బిట్‌కాయిన్ స్కామ్‌లో హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ED దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న PMLA ప్రత్యేక కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. బిట్‌కాయిన్ పోంజీ స్కామ్ సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి ఆయన 285 బిట్కాయిన్లు (రూ.150 కోట్లకు పైగా విలువ) తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జనవరి 19న హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
News January 6, 2026
చలిగా ఉందని వేడి నీటితో స్నానం చేస్తున్నారా?

చలికాలంలో వేడి నీళ్లతో స్నానం హాయిగా అనిపించినా లేనిపోని సమస్యలొస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగలు కక్కే నీటితో స్నానం చేస్తే ‘చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. ఆపై చర్మం పొడిగా మారి దురద, పగుళ్లు ఏర్పడతాయి. తలస్నానం చేస్తే జుట్టు పొడిబారి, బలహీనమై రాలిపోతుంది. శరీర ఉష్ణోగ్రతతో పాటు బీపీ పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి’ అని సూచిస్తున్నారు.


