News May 23, 2024
రిగ్గింగ్ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు: అనిల్ కుమార్ యాదవ్

AP: పోలింగ్ రోజు టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని నరసరావుపేట YCP MP అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ‘టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట రీపోలింగ్ నిర్వహించాలి. 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్కటే వీడియో బయటకు రావడం ఏంటీ? టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఈసీ తీరుపై మాకు అనుమానాలు ఉన్నాయి. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
బ్లూ మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాలి: దేవినేని ఉమా

ప్రజాస్వామ్యంలో పేదవాడైనా, సంపన్నుడైనా చట్టం ముందు అందరం సమానమేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరవు పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యాడని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు లేదని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో కోర్టుకు వస్తున్నావని అభిమానం ఉప్పొంగిందా అంటూ ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఉండి ఏపీపై విషం చిమ్ముతున్న బ్లూ మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాలని దుయ్యబట్టారు.
News November 21, 2025
బరితెగించారు.. మోదీ-మైథిలీపై AI అసభ్యకర వీడియో

AI టెక్నాలజీతో క్రియేటర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా పీఎం మోదీ, బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన సింగర్ మైథిలి ఠాకూర్పై అసభ్యకర AI వీడియోను రూపొందించి SMలో పెట్టారు. దీన్ని బీజేపీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే ఆ వీడియోను తొలగించాలని, క్రియేట్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
NOTE: సెన్సిటివిటీ దృష్ట్యా వీడియోను పోస్ట్ చేయలేకపోతున్నాం.
News November 21, 2025
RTC బస్సులో ప్రయాణించిన సీఎం సతీమణి

AP: కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని CM చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొందారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆమె శాంతిపురం నుంచి తుమ్మిసి వరకు బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.


