News January 17, 2025

బీదర్ దొంగల కోసం కొనసాగుతున్న పోలీసుల వేట

image

<<15173290>>బీదర్ దొంగల కోసం<<>> పోలీసులు వేట కొనసాగుతోంది. నిందితులను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారు హైదరాబాద్ నుంచి అడ్డదారుల్లో రాయ్‌పూర్‌కు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. నిన్న బీదర్‌లో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి ఏటీఎం డబ్బులు దొంగిలించిన నిందితులు సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. అఫ్జల్ గంజ్‌లో ట్రావెల్స్ సిబ్బందిపై కాల్పులు జరిపి పరారయ్యారు.

Similar News

News February 4, 2026

మున్సిపల్ ఎన్నికలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం

image

TG: పంచాయతీ ఎన్నికల్లాగే.. మున్సిపల్ పోరులోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధించాలని మంత్రులతో CM రేవంత్ రెడ్డి అన్నారు. క్యాబినెట్ మంత్రులతో సమావేశమైన సీఎం, ఎలక్షన్‌లో ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. విజయంపై నివేదికలన్నీ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని, అయినా ఎన్నికలు పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంకా రెబల్స్ ఉంటే వారిని రాజీ చేయాలని, మంత్రులంతా జిల్లాలకు వెళ్లాలని సూచించారు.

News February 4, 2026

TODAY HEADLINES

image

* మా సహనమే గెలిపించింది.. USతో ట్రేడ్ డీల్‌పై మోదీ
* మోదీని బెదిరించి ట్రంప్ డీల్: రాహుల్
* రాహుల్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు: గోయల్
* మణిపుర్ CMగా ఖేంచంద్
* కల్తీ నెయ్యి కేసు.. విచారణ కమిషన్‌కు AP క్యాబినెట్ నిర్ణయం
* మద్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు: పవన్
* మోహన్ బాబు, విష్ణుపై కేసు
* TGకి 4.30 లక్షల ఇళ్లు: కిషన్ రెడ్డి
* 2L ఉద్యోగాలు ఎక్కడ: KTR
* TG: చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు

News February 4, 2026

మయన్మార్‌లో భూకంపం.. కోల్‌కతాలోనూ ప్రకంపనలు

image

మయన్మార్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.9గా నమోదైంది. భూకంప తీవ్రత వల్ల బంగ్లాదేశ్, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఇళ్లు, ఆఫీసులు స్వల్పంగా ఊగడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. 71 గంటల్లో మయన్మార్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి.