News July 8, 2024
నేడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసు విచారణ
AP: మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేడు పోలీసులు విచారించనున్నారు. పోలింగ్ రోజున పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసినట్లు, అడ్డొచ్చిన టీడీపీ ఏజెంటుపై దాడి చేసినట్లు పిన్నెల్లిపై ఆరోపణలున్నాయి. తర్వాతి రోజు విధుల్లో ఉన్న సీఐని రాయితో కొట్టినట్లు కూడా కేసు ఉంది. ఈ కేసుల్లో పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు ఈరోజు, రేపు నెల్లూరు జైలులో పోలీసులు ఆయన్ను విచారించనున్నారు.
Similar News
News January 17, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’: మూడు రోజుల్లో రూ.106 కోట్లు
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేశ్’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
News January 17, 2025
చైనాలో మళ్లీ తగ్గిన జనాభా.. ఆందోళన
జనాభాలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న చైనాలో వరుసగా మూడో ఏడాది పాపులేషన్ తగ్గింది. 2023లో 1.409 బిలియన్ల జనాభా ఉంటే 2024 చివరికి అది 1.408 బి.కు తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. 1980-2015 వరకు చైనా అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ, లివింగ్ కాస్ట్ పెరగడం వల్ల జనాభా తగ్గుతున్నట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతూ పని చేసే వారి సంఖ్య తగ్గిపోతోందనే ఆందోళన నెలకొంది.
News January 17, 2025
సింగపూర్ మినిస్టర్‌తో సీఎం రేవంత్ భేటీ
సింగపూర్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, టూరిజం, ఎడ్యుకేషన్&స్కిల్స్ బిల్డింగ్, ఐటీ పార్క్స్ వంటి అంశాలపై చర్చించారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈనెల 19 వరకు సింగపూర్‌లోనే ఉండనున్న సీఎం రేవంత్ బృందం రాష్ట్రంలో పెట్టుబడుల అంశాలపై కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.