News January 3, 2025

దున్నపోతుపై పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న పోలీసులు

image

అత్యాధునిక వాహనాలు, గుర్రాలను వినియోగిస్తూ పోలీసులు గస్తీ కాయడం చూస్తుంటాం. అయితే, బ్రెజిల్‌లో కొందరు మిలిటరీ సైనికులు దున్నపోతులపై సవారీ చేస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తారు. వీటిని తడిసిన బురద నేలలో అనుమానితులను వెంబడించేందుకు, మడ చిత్తడి నేలల గుండా వెళ్లడానికి, నదుల్లో ఈదేందుకు ఉపయోగిస్తారు. వర్షాకాలంలో విస్తారమైన ద్వీపం అంతటా నేరస్థులను వేటాడేందుకు ఏకైక మార్గం ఇవే అని పోలీసులు చెబుతున్నారు.

Similar News

News January 5, 2025

CMR కాలేజీ హాస్టల్ ఘటన.. ఇద్దరు అరెస్ట్

image

TG: CMR కాలేజీ హాస్టల్ బాత్రూం వీడియోల కేసులో బిహార్‌కు చెందిన కిశోర్, గోవింద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు దురుద్దేశపూర్వకంగా అమ్మాయిల బాత్రూంలోకి తొంగిచూసినట్లు, విద్యార్థినులను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించారు. కాలేజీ ఛైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి, వార్డెన్ ప్రీతిరెడ్డితో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. విద్యార్థుల ఫిర్యాదులను పట్టించుకోలేదని వారిపై ఆరోపణలు వచ్చాయి.

News January 5, 2025

సంక్రాంతికి వారం రోజులు సెలవులు

image

TG: సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. స్కూళ్లకు జనవరి 11 నుంచి 17 వరకు, జూనియర్ కాలేజీలకు 11 నుంచి 16 వరకు హాలిడేస్ ప్రకటించింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న (శనివారం) తెరుచుకోనున్నాయి. కాగా, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి సెలవులు ఉండగా తాజాగా రెండు రోజులు ముందుగానే హాలిడేస్ ప్రకటించింది.

News January 5, 2025

దంపతుల టోకరా.. వ్యాపారవేత్తకు ₹7.63 కోట్ల మోసం

image

అధిక రాబ‌డులకు ఆశ ప‌డి నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ₹7.63 కోట్లు న‌ష్ట‌పోయారు. జ‌యంత్ గులాబ్‌రావ్‌, అత‌ని భార్య కేస‌రి ఓ సంస్థ‌లో పెట్టుబ‌డులు పెడితే ఏటా 35% లాభాలు వ‌స్తాయ‌ని జితేంద‌ర్ జోషిని న‌మ్మించారు. ప్రారంభంలో మంచి లాభాలు రావడంతో జోషి భారీగా పెట్టుబ‌డులు పెట్టారు. తీరా జ‌యంత్ దంప‌తులు మొహం చాటేయ‌డంతో జోషి ₹7.63Cr మోస‌పోయారు. ఆర్థిక నేర విభాగం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తోంది.