News April 12, 2025
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి

TG: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పోలీసుల నుంచి అనుమతి పత్రాలు అందుకున్నారు. రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
Similar News
News April 13, 2025
అంతర్జాతీయ క్రికెట్లో కొత్త రూల్స్!

అంతర్జాతీయ క్రికెట్లో కొత్త రూల్స్ అమలయ్యే అవకాశముంది. వన్డేల్లో పదేళ్ల నుంచి అమల్లో ఉన్న 2 కొత్త బంతుల విధానాన్ని మార్చాలని గంగూలీ సారథ్యంలోని క్రికెట్ కమిటీ ఐసీసీకి ప్రతిపాదించింది. ఒకప్పటిలా ఒకే బంతి వాడితే పాతబడ్డాక రివర్స్ స్వింగ్, స్పిన్కు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. WTCలో భారీ తేడాతో గెలిస్తే, పెద్ద జట్లను చిన్నవి ఓడిస్తే అదనపు పాయింట్లు ఇవ్వాలంది. త్వరలో ICC తుది నిర్ణయం తీసుకోనుంది.
News April 13, 2025
తెలుగు విద్యార్థికి 300కు 300 మార్కులు?

ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన JEE మెయిన్ తుది విడత పరీక్షల <
News April 13, 2025
ఇంటర్ ఫెయిల్ అవుతానేమోననే భయంతో..

TG: రంగారెడ్డి జిల్లా చటాన్పల్లిలో విషాదం నెలకొంది. ఇటీవల రాసిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో ప్రణీత(18) అనే అమ్మాయి బాత్రూమ్లో చున్నీతో ఉరేసుకుని చనిపోయింది. ఆమె పుట్టినరోజే ఇలా చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పరీక్షలు సరిగా రాయలేదని కొన్నిరోజులుగా కూతురు ఆవేదనతో ఉందని వారు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.