News July 7, 2025

జగన్ పర్యటనకు పోలీసుల అనుమతి

image

AP: వైసీపీ అధినేత జగన్ ఎల్లుండి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. మామిడి రైతులను పరామర్శించే మార్కెట్ యార్డు చిన్నది కావడంతో జగన్‌తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని ఆంక్షలు విధించారు. పర్యటనలో ఎలాంటి ర్యాలీలు, రోడ్‌షోలు చేయకూడదని నిబంధన పెట్టారు. గత పర్యటనల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు జాగ్రత్తలు పాటిస్తున్నారు.

Similar News

News July 7, 2025

రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్న సీఎం?

image

AP: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ఇవాళ 880 అడుగులకు నీరు చేరింది. దీంతో రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా డ్యామ్ గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. నదీ జలాలకు చీరసారెను ఆయన సమర్పించనున్నట్లు తెలిసింది. సీఎం పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News July 7, 2025

గ్రూప్-1పై తీర్పు రిజర్వ్

image

TG: గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న పిటిషన్లపై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. మెయిన్స్ జవాబు పత్రాలను పున:మూల్యాంకనం చేయాలని, లేదంటే మళ్లీ పరీక్షలు పెట్టాలని కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై గతంలో జడ్జి జస్టిస్ రాజేశ్వరరావు స్టే విధించారు. దీన్ని సవాలు చేస్తూ ఎంపికైన అభ్యర్థులు పిటిషన్లు వేశారు. ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.

News July 7, 2025

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం: అచ్చెన్న

image

AP: మాజీ సీఎం జగన్ రైతు ఓదార్పు యాత్రల పేరుతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఊరుకోబోమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా జగన్ చేయలేదన్నారు. వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. తాము మిర్చి, మామిడి, కోకో, పొగాకు రైతులకు న్యాయం చేశామని వివరించారు. జగన్‌ను నిలదీయాలని రైతులకు మంత్రి సూచించారు.