News September 23, 2024
జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్

అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విషయమై ఆయనను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందన్నారు. కాగా గోవాలో జానీ మాస్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 7, 2025
టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

టాటా, మారుతి సుజుకీ DECలో కార్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మారుతి Invictoపై ₹2.15 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. ₹లక్ష క్యాష్ డిస్కౌంట్, ₹1.15 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వనుంది. Fronxపై ₹88వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హారియర్, సఫారీ SUVలపై ₹75 వేల వరకు క్యాష్ డిస్కౌంట్‌ను టాటా అందిస్తోంది. పాత మోడల్ తీసుకుంటే ₹లక్ష దాకా రాయితీ ఇవ్వనుంది. ఇతర మోడల్స్కూ ₹25K-55K డిస్కౌంట్స్ ఇస్తోంది.
News December 7, 2025
అక్కడ ఫ్లైట్లు ఎగరవు.. ఎందుకో తెలుసా?

టిబెట్ పీఠభూమిలో ఎత్తైన పర్వతాలు ఉండటంతో ఫ్లైట్లు నడపడం చాలా కష్టం. 2.5 మిలియన్ల చదరపు కి.మీ విస్తరించి ఉన్న ఆ పీఠభూమిలో సగటున 4,500 మీటర్ల ఎత్తైన పర్వతాలు ఉంటాయి. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండటంతో ఇంజిన్ పనితీరు తగ్గిపోతుంది. ఎమర్జెన్సీలో ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి అక్కడ ఇతర విమానాశ్రయాలు ఉండవు. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. వర్షాలు, భారీ ఈదురుగాలులు వీస్తాయి.
News December 7, 2025
పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో KG స్కిన్ లెస్ చికెన్ ధర ₹260గా ఉంది. వరంగల్, కామారెడ్డిలోనూ ఇవే రేట్లున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, చిత్తూరులో ₹240-260, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ₹220-230 వరకు పలుకుతోంది. ఇక మటన్ కేజీ ₹800-900 వరకు అమ్ముతున్నారు. కోడిగుడ్డు ధర రిటైల్‌లో ఒక్కోటి ₹7-9కి అమ్ముతున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?


