News December 24, 2024
మోహన్‌బాబుపై చర్యలకు సిద్ధమవుతున్న పోలీసులు!

TG: జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్‌బాబుకు గతంలో హైకోర్టు ఇచ్చిన ఉపశమనం గడువు నేటితో ముగియనుంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిన్న ధర్మాసనం కొట్టేసింది. దీంతో తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇవాళ ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారని సమాచారం.
Similar News
News December 31, 2025
టెన్త్ అర్హతతో ఫెడరల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

ఫెడరల్ బ్యాంక్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతగల వారు JAN 8 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 -20 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ FEB 1న నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC,STలకు రూ.100. వెబ్సైట్: https://www.federal.bank.in
News December 31, 2025
VHT: 14 సిక్సర్లతో సర్ఫరాజ్ విధ్వంసం

విజయ్ హజారే ట్రోఫీలో గోవాతో జరుగుతున్న మ్యాచులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం సృష్టించారు. 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లతో 157 రన్స్ చేశారు. దీంతో 50 ఓవర్లలో ముంబై 444/8 స్కోరు చేసింది. ఉత్తరాఖండ్‌తో మ్యాచులో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 124 రన్స్ చేశారు. అటు పుదుచ్చేరితో మ్యాచులో కర్ణాటక ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(132), దేవదత్ పడిక్కల్(113) శతకాల మోత మోగించారు.
News December 31, 2025
సూర్య, నేను మంచి స్నేహితులమే: ఖుషీ

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్య కుమార్ తనకు తరచూ <<18713013>>మెసేజ్<<>> చేసేవాడన్న వ్యాఖ్యలపై నటి ఖుషీ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు. తాము మంచి స్నేహితులమని తెలిపారు. అంతకుమించి చెప్పడానికీ తమ మధ్య ఏమీ లేదన్నారు. కాగా ఆ సమయంలో సూర్య మ్యాచ్ ఓడిపోవడంతో తాను బాధపడినట్లు పేర్కొన్నారు. దీంతో అప్పుడే క్లారిటీగా చెప్పాల్సిందని ఖుషీపై సూర్య ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.


