News December 24, 2024

అల్లు అర్జున్‌పై పోలీసుల ప్రశ్నల వర్షం!

image

PSలో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. గంటన్నర నుంచి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్లో ఉన్నప్పుడు తెలియదా? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు? అనుమతి లేకుండా రోడ్‌షో ఎందుకు చేశారు? వంటి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. బన్నీ చెప్పే సమాధానాలు కీలకంగా మారనున్నాయి. ఆయన పొంతనలేని ఆన్సర్లు చెప్తే థియేటర్‌కు తీసుకెళ్లి విచారించే అవకాశం ఉంది.

Similar News

News January 23, 2026

Plz.. ఆ రీల్‌కు పిల్లల్ని దూరంగా ఉంచండి: అనిల్ రావిపూడి

image

తన డైరెక్షన్‌లోని లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ పాపులర్ డైలాగ్స్‌లో ‘మద్యపానం మహదానందం’ ఒకటని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఇన్‌స్టాలో ఇది విపరీతంగా వైరల్ అవుతోందని, ఇన్‌స్టాలో వెరైటీగా రీల్స్ వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అయితే పిల్లలకు మాత్రం దీన్ని చూపించొద్దని, వారిచే దానిపై రీల్ చేయించొద్దని కోరారు.

News January 23, 2026

Paytm షేర్ విలువ 10% డౌన్.. కారణమిదే

image

Paytm మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్’ షేర్లు ఒక్కరోజే 10% పడిపోయి ₹1,134కు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్’ (PIDF) పథకం 2025 డిసెంబర్ తర్వాత కొనసాగుతుందో లేదో అన్న ఆందోళనే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. Paytm లాభాల్లో ఈ పథకం ద్వారా వచ్చే ప్రోత్సాహకాలే 20% వరకు ఉంటాయని అంచనా. దీనిపై RBI నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

News January 23, 2026

ప్రభుత్వ బడుల్లో కేంబ్రిడ్జి పాఠాలు!

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించేలా కేంబ్రిడ్జి వర్సిటీ(UK)తో GOVT ఒప్పందం చేసుకోనుంది. దీనిద్వారా జాయింట్ రీసెర్చ్, కరిక్యులమ్ రూపొందిస్తారు. 8-10 తరగతుల్లో కేంబ్రిడ్జి సర్టిఫైడ్ ఆన్‌లైన్ కోర్సులు, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ప్రవేశపెడతారు. AU, IIT తిరుపతి సహా ఇంజినీరింగ్ కాలేజీల్లో వర్సిటీ భాగస్వామ్య కోర్సులు నిర్వహిస్తారు. ఈమేరకు దావోస్‌లో మంత్రి లోకేశ్ వర్సిటీ VCతో చర్చించారు.