News December 21, 2024

త్వరలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీ

image

AP: పోలీసు, జైళ్లు, న్యాయశాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. అన్ని శాఖలు సమర్థంగా పనిచేసేలా తమ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పారు. అటు ప్రత్యేక, ఫాస్ట్‌ట్రాక్, ఏసీబీ కోర్టుల ద్వారా మహిళలకు సత్వర న్యాయం అందించేలా న్యాయవ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు.

Similar News

News December 21, 2024

కేజ్రీపై ఈడీ విచారణకు ఢిల్లీ ఎల్‌జీ గ్రీన్ సిగ్నల్

image

ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ CM కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా ఈడీకి అనుమతినిచ్చారు. ఎక్సైజ్ పాలసీలో భారీ స్థాయి అవినీతిని గుర్తించామని, కేజ్రీని విచారించేందుకు అనుమతించాలని ఈ నెల 5న ఈడీ LGని కోరింది. ‘సౌత్‌గ్రూప్‌’తో కలిసి కేజ్రీవాల్ రూ.100 కోట్ల లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారని, కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపణలున్నాయి.

News December 21, 2024

70లలోనూ హృతిక్ రోషన్ తల్లి ఎలా ఉన్నారంటే?

image

ప్రపంచ అందగాళ్ల జాబితాలో మూడో ప్లేస్‌లో ఉన్న బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ 50 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపిస్తుంటారు. అయితే, హృతిక్ తల్లి పింకీ కూడా ఫిట్‌నెస్‌లో ఆయన్ను మించిపోయిందని నెట్టింట చర్చ జరుగుతోంది. 70 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అన్నట్లుగా ఫిట్‌గా ఉండటాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. జిమ్‌లో ఇద్దరూ కసరత్తు చేస్తున్న ఫొటోలు వైరలవుతున్నాయి.

News December 21, 2024

ఫామ్‌హౌస్‌లో ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలా?: సీతక్క

image

TG: కౌలు రైతులకు బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని మంత్రి సీతక్క అసెంబ్లీలో మండిపడ్డారు. ‘రూ.5లక్షల జీతాలు తీసుకునే వారికి గతంలో రైతు బంధు వచ్చింది. సాగులో లేని, గుట్టలకు కూడా డబ్బులు వేశారు. నిజంగా సాగు చేస్తూ పట్టాలు లేని రైతులకు ఇవ్వలేదు. పట్టా ఉన్నవారికే మీ పాలనలో రైతుబంధు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న వారికి కూడా డబ్బులు ఇవ్వాలా?’ అని ఆమె ప్రశ్నించారు.