News July 6, 2024

హీరో రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు.. స్పందించిన పోలీసులు

image

TG: హీరో రాజ్‌తరుణ్ తనను మోసం చేశారని లావణ్య చేసిన ఫిర్యాదుపై నార్సింగి పోలీసులు స్పందించారు. ‘4 పేజీలతో హీరో రాజ్‌తరుణ్ సహా మరికొందరిపై ఆమె ఫిర్యాదు చేశారు. సరైన ఫార్మాట్‌లో కంప్లైంట్ లేదు. తేదీలు, సమయం, ప్లేస్ వివరాలు ఇవ్వలేదు. ఫోన్ కాల్స్, నోటీసులకు ఆమె స్పందించడం లేదు’ అని వెల్లడించారు. అటు సాయంత్రం వరకు వేచి చూసి దీన్ని తప్పుడు ఫిర్యాదుగా పోలీసులు పరిగణించే ఛాన్సుంది.

Similar News

News March 17, 2026

ALERT: ఇలా చేస్తే అకౌంట్లలోకి రూ.6,000

image

TG: ఈ నెల 22న ప్రభుత్వం తొలి విడత రైతు భరోసా <<19392898>>నిధులు<<>> విడుదల చేయనుంది. 2026 FEB 28లోపు కొత్త పట్టాదారు పాస్‌బుక్స్ పొందినవారు పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పాస్‌బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసి దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సమర్పించాలి. అధికారులు పరిశీలించి అర్హుల జాబితాలో చేరుస్తారు. దాన్ని బట్టి ప్రభుత్వం రూ.6,000 ఖాతాల్లో జమ చేస్తుంది.

News March 17, 2026

చావు నుంచి క్షణాల్లో తప్పించుకున్న మొజ్తబా

image

ఇజ్రాయెల్ దాడిలో అయతుల్లా అలీ ఖమేనీ సహా ఇతర కుటుంబీకులు, ఇరాన్ ఉన్నతాధికారులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ అటాక్ నుంచి ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ త్రుటిలో తప్పించుకున్నారంటూ ఆ దేశ అధికారులు మాట్లాడుకున్న ఆడియో లీకైనట్లు ‘టెలిగ్రాఫ్’ తెలిపింది. ఖమేనీ నివాసంపై మిస్సైల్ పడటానికి కొన్ని సెకన్ల ముందే మొజ్తబా గార్డెన్‌లోకి నడుచుకుంటూ వెళ్లడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారని పేర్కొంది.

News March 17, 2026

తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం: రోజూ స్వీట్ పొటాటో తింటే?

image

తక్కువ రేటుకు లభించే స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్, విటమిన్-A, C, E, B6, పొటాషియం, పీచు తదితర పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ల నుంచి రక్షించే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ‘రోజూ చిలగడదుంప తింటే వ్యాధినిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం, బీపీ, ఒత్తిడి తగ్గుతాయి. కంటి, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt