News July 13, 2024

చనిపోతున్నానంటూ లావణ్య సూసైడ్ నోట్.. కాపాడిన పోలీసులు

image

తాను చనిపోతున్నానంటూ టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య అర్ధరాత్రి పోలీసులు, మీడియాకు సూసైడ్ నోట్ పంపడం కలకలం రేపింది. దీంతో నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి కాపాడారు. ‘రాజ్ లేని ప్రపంచంలో నేను ఉండలేను. కానీ అతడు మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. దీనంతటికి మాల్వీనే కారణం. నా దగ్గరి వాళ్లు కూడా నన్ను అర్థం చేసుకోలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News January 21, 2026

గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు అటల్ పెన్షన్ యోజన

image

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరో ఐదేళ్లు(2030-31) పొడిగించేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం APYలో 8.66 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 18-40 ఏళ్ల వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. వయసును బట్టి రూ.42 నుంచి రూ.1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటాక రూ.1000-5000 వరకు పెన్షన్ అందుతుంది.

News January 21, 2026

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఇంజినీర్స్<<>> ఇండియా లిమిటెడ్‌ 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(సోషల్ వర్క్, సోషియాలజీ, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్), MBA, BE/BTech, BSc, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruitment.eil.co.in

News January 21, 2026

‘2000s’ గ్యాంగ్.. క్రికెటర్ల సెల్ఫీ వైరల్

image

2000దశకంలో క్రికెట్ చూడటం మొదలుపెట్టిన వారికి పైఫొటోలో ఎవరో ఒకరు ఫేవరెట్ ప్లేయరై ఉంటారు. ఓపెనర్‌గా సెహ్వాగ్ బాదుడు, సిక్సర్ల వీరుడు యువరాజ్, ఫీల్డింగ్‌లో కైఫ్ దూకుడు, బౌలింగ్‌లో అగార్కర్, నెహ్రా సత్తా.. ఇలా అప్పట్లో వీరి ఆటకు క్రేజే వేరు. తాజాగా వీరంతా ఒకే దగ్గర కలుసుకొని సెల్ఫీ దిగారు. లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కుమారుడు అంగద్ బేడీ, స్పోర్ట్స్ ప్రజెంటర్ గౌరవ్ కపూర్‌ కూడా వీరితో ఉన్నారు.