News July 28, 2024
పెద్దిరెడ్డి PA ఇంట్లో పోలీసుల సోదాలు

AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్ల దగ్ధంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి PA శశికాంత్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని శశికాంత్ నివాసంలో ఈ సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో నుంచి 4 బాక్సుల్లో ఫైళ్లను తీసుకెళ్లారు. కాగా APకి చెందిన ఓ మాజీ MLA ఇంట్లో శశికాంత్ నివాసం ఉంటున్నారు. ఆ మాజీ MLA ముందే తనిఖీలు చేశారు.
Similar News
News January 18, 2026
సూర్యుడి 7 గుర్రాల పేర్లు మీకు తెలుసా?

సూర్యరశ్మి7 రంగుల మిశ్రమమని సైన్స్ చెబుతోంది. సూర్యుడు 7 గుర్రాల రథంపై సంచరిస్తాడని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ 7 గుర్రాలు వేదాల్లోని 7 ప్రధాన ఛందస్సులకు ప్రతీకలు. అవి: గాయత్రి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు. సూర్యకాంతిలోని 7 రంగులకు ఈ 7 గుర్రాల రూపాలు సరిపోతాయని ఆధ్యాత్మిక వేత్తలు భావిస్తారు. అంటే అటు సైన్స్ పరంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఈ సంఖ్యకు విడదీయలేని సంబంధం ఉంది.
News January 18, 2026
మాడ్యులర్ కిచెన్ చేయిస్తున్నారా?

మాడ్యులర్ కిచెన్ చేయించేటపుడు వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. సరుకులన్నీ భద్రపరచడానికి వీలుగా అల్మారా లేదా డీప్ డ్రాలను నిర్మించుకోవాలి. చాకులు, స్పూన్లు, గరిటెలు విడివిడిగా పెట్టుకొనే సౌలభ్యం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వస్తువులు నీట్గా కనిపిస్తాయి. కావాల్సిన వస్తువు వెంటనే చేతికి దొరుకుతుంది. వంటగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటానికి వీలుగా అవసరమైన చోట్లలో ప్లగ్ బోర్డ్స్ ఉండేలా చూసుకోవాలి.
News January 18, 2026
ప్రైవేట్ స్కూళ్లలో రెండేళ్లకోసారి 8% ఫీజు పెంపు?

TG: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజును రెండేళ్లకోసారి 8% పెంచుకునేలా అనుమతించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతకుమించి పెంచుకోవాలంటే రాష్ట్ర ఫీజు నియంత్రణ కమిటీ ఆమోదం తప్పనిసరి చేస్తూ ఫీజుల నియంత్రణ చట్టం విధివిధానాలను ఖరారు చేసినట్లు సమాచారం. మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.


