News October 27, 2024
క్రాకర్స్ కాల్చేవారికి పోలీసుల షాక్

TG: హైదరాబాద్ వాసులకు పోలీసులు షాక్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 వరకే క్రాకర్స్ కాల్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. భారీ శబ్దంతో పేలే టపాసులను కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 55 డెసిబెల్స్కు మించి శబ్దం చేసే క్రాకర్స్ కాల్చొద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతానికి దివ్య ముహూర్తం నేడే..

శని దోష నివారణ కోసం చేసే 7 శనివారాల వ్రతాన్ని నేడు ప్రారంభించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ‘వ్రతాన్ని ఈరోజు మొదలుపెడితే వచ్చే ఏడాది JAN3 పౌర్ణమి రోజున పూర్తవుతుంది. పౌర్ణమి సంయోగం వల్ల అధిక ఫలితం ఉంటుంది. ఏడో వారానికి ముందు వైకుంఠ ఏకాదశి రావడం, వ్రత కాలంలో ధనుర్మాసం ఉండటం వల్ల శనిదేవుడు, విష్ణువు అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు’ అంటున్నారు. వ్రతం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 22, 2025
సమీకృత దాణాతో పశువులకు కలిగే మేలు

పశువుల పోషణలో భాగంగా పాడిపశువులకు సమతుల ఆహారం అందించడం ముఖ్యం. రోజూ అందించే దాణాతో పాటు సమీకృత దాణా కూడా అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాల దిగుబడి కూడా పెరుగుతుంది. మనకు అందుబాటులో ఉన్న దినుసులను తగిన మోతాదులో కలిపి సమీకృత దాణాను తయారు చేయవచ్చు. ఇలా స్వయంగా తయారు చేసుకున్న దాణాలో మెులాసిస్ అరోమా పొడిని 250-500 గ్రాములు కలిపితే దాణా సువాసన కలిగి, రుచిగా ఉంటుంది.
News November 22, 2025
గుడిలో దండలు మార్చుకుని.. IASల ఆదర్శ వివాహం

AP: పెళ్లంటే ఆర్భాటం కాదు అర్థం చేసుకోవడమేనని నిరూపించారు ఇద్దరు ఐఏఎస్లు. విశాఖ కైలాసగిరి శివాలయంలో నిరాడంబరంగా దండలు మార్చుకుని, తర్వాత సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకాలు చేసి దంపతులయ్యారు. అల్లూరి జిల్లా పాడేరు ITDA ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీపూజ, మేఘాలయలోని దాదెంగ్రి జాయింట్ కలెక్టర్ ఆదిత్య వర్మల వివాహ తంతు ఇలా సింపుల్గా పూర్తయ్యింది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం విశేషం.


